Lunar Eclipse: చంద్రగ్రహణం ముందు.. తర్వాత.. ఇలా చేయండి..
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:00 PM
మరికొన్ని నిమిషాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
భాద్రపద పౌర్ణమి.. సెప్టెంబర్ 7వ తేదీన రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో.. కుంభరాశిలో ఏర్పడనుంది. ఆదివారం రాత్రి 9:56 గంటల నుంచి రాత్రి 1:26 గంటల వరకూ ఈ గ్రహణం ఉంటుంది. రాత్రి 11:42 గంటలను గ్రహణ మధ్యస్థ కాలంగా పండితులు నిర్ణయించారు.
ఈ గ్రహణం.. మనస్సుపై ప్రభావం..
జోతిష్య శాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం.. మానసిక స్థితి, కెరీర్‌తోపాటు ఆరోగ్య సమస్యలపై ప్రభావం చూపుతుందంటారు. అయితే ఒక్కో రాశి వారిపై ఈ గ్రహణ ప్రభావం వేర్వేరుగా ఉంటుందని చెబుతారు. ఈ గ్రహణ ప్రభావం కొంత మందికి అనుకూల ఫలితాలు కలిగిస్తే.. మరికొందరికి మిశ్రమ ఫలితాలను కలిగిస్తుందని పేర్కొంటారు.
ముందు.. ఆ తర్వాత..
ఈ నేపథ్యంలో చంద్రగ్రహణం ముందు, ఆ తర్వాత చేయాల్సిన పనులు గురించి తెలుసుకుందాం. అయితే గ్రహణ సమయంలో మాత్రం ఏం చేయాలంటే.. ఆ సమయంలో కొన్ని మంత్రాలు జపించాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమ: శివాయ, గాయత్రీ తదితర మంత్రాలు జపించాల్సి ఉంటుంది.
అలాగే శివుడిని, మహా విష్ణువుని ధ్యానించాలి. దీంతో ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతారు. అలాగే ఆహార నియమాలు సైతం పాటించాలని అంటున్నారు. గ్రహణం ప్రారంభానికి ముందు.. అలాగే గ్రహణం ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవడం ఉత్తమమని పేర్కొంటున్నారు.
ఆ సమయంలో..
గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పూజలు చేయవద్దు. ప్రశాంతత కోసం ధ్యానం చేయడం, దైవాన్ని తలుచుకోవడం వల్ల ఆందోళన తగ్గుతుంది. ఈ గ్రహణ సమయంలో గర్బిణీ స్త్రీలు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోవాలి. వీరు గ్రహణ సమయంలో కదలకుండా ఉండాలని పెద్దలు చెబుతున్నారు.
గ్రహణం అనంతరం..
గ్రహణం అనంతరం దానం చేయాలి. చంద్రగ్రహణం కనుక తెల్లటి వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం. అలాగే గ్రహణం ముగిసిన తర్వాత పాలు, బియ్యం, చక్కెరలను అవసరమైన వారికి దానం చేయాలి. ఇంటిలోని దేవుని మందిరాన్ని సైతం గ్రహణ సమయంలో మూసి ఉంచాలి.
ఇవి కూడా చదవండి..
ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో పని, వేతనం ఎంతంటే
రైతులను పరామర్శించేందుకు పంజాబ్‌లో 9న మోదీ పర్యటన