Weekly Horoscope: ఆ రాశి వారికి ఈవారం అంతా లాభదాయకమే..
ABN , Publish Date - Jul 06 , 2025 | 08:15 AM
ఆ రాశి వారికి ఈవారం అంతా లాభదాయకమేనని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయని, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారని, ఆదాయానికి మించి ఖర్చులుంటాయని, పొదుపు ధనం అందుకుంటారని తెలుపుతున్నారు. ఇంకా... ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఎన్నాయో ఓసారి పరిశీలిస్తే...

అనుగ్రహం
6 - 12 జూలై 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. స్థిరాస్తి వ్యవ హారంలో ఏకాగ్రత వహించండి. తొందర పాటు నిర్ణయాలు తగవు. యత్నాలు ప్రోత్సా హకరంగా సాగుతాయి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. పాత పరిచయస్తులను కలుసు కుంటారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవం తమవుతుంది. లక్ష్యం సాధిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. ప్రణాళికాబద్థంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలి స్తాయి. ఖర్చులు విపరీతం. గృహమరమ్మ తులు చేపడతారు. పొరుగువారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. సంతృప్తికరం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
గ్రహస్థితి సామాన్యం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. చుట్టు పక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. కనిపిం చకుండా పోయిన వస్తువులు లభ్యమవు తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. ఆశా వహదృక్పథంతో మెలగండి. పెద్దల హితవు ఉత్తేజపరుస్తుంది. ధైర్యంగా అడుగు ముందు కేస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడికి గురికా వద్దు. ఖర్చులు అధికం. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. నోటీసులు అందుకుంటారు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆలోచ నల్లో మార్పు వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా విశేష ఫలితా న్నాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. పొదుపు ధనం అందుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనవసర జోక్యం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అయినవారిని సంప్రదిస్తారు. పెద్దల చొరవతో సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
వ్యవహారంలో తొందరపాటు తగదు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల వ్యాఖ్యలు ప్రభా వితం చేస్తాయి. ఉత్సాహంగా అడుగు ముం దుకు వేస్తారు. చీటికి మాటికి అసహనం చెందుతారు. పనులు, బాధ్యతలు అప్పగించ వద్దు. వ్యతిరేకులతో జాగ్రత్త. మీపై కొందరు నిఘా పెట్టారని తెలుసుకోండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. విలువైన వస్తువులు జాగ్రత్త.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
అన్నివిధాలా అనుకూలమే. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. అవకాశాలను అందిపుచ్చు కుంటారు. పరిచయాలు ఉన్నతికి దోహద పడతాయి. సంతోషకరమైన వార్త వింటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాహన సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. పిల్లలకు విదేశీ విద్యావకాశం లభిస్తుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. బంధువులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పరిచయస్తుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగి స్తారు. మీ కృషి ఫలించే సమయం త్వరలోనే ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుం టాయి. ధనసహాయం తగదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రణాళికా బద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ నుంచి విషయాలు ేసకరించేందుకు కొందరు యత్నిస్తారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
లావాదేవీల్లో ఏకాగ్రత వహిం చండి. అనాలోచిత నిర్ణయం తగదు. నిపు ణుల సలహా పాటించండి. రావలసినధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అనవసర విషయాల జోలికి పోవద్దు. ఇంటి పరిస్థితుల పై దృష్టిసారించండి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సన్నిహితులతో సంభాషణ ఊరటనిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. రుణవిముక్తులవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. చీటికి మాటికి అసహనం చెందుతారు. యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అన్ని రంగాల వారికీ అనుకూల సమయం. మాట నిలబెట్టుకుంటారు. బంధు మిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగు తుంది. విలాసాలకు విపరీతంగాఖర్చుచేస్తారు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. కొత్త పనులు చేపడతారు. అవకాశాలుకలిసివస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.