Share News

Yashoda Hospitals : ఐపీఓకు యశోద హాస్పిటల్స్‌

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:37 AM

హైదరాబాద్‌కు చెందిన యశోద హాస్పిటల్స్‌ కూడా పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఓ ద్వారా రూ.4,000 కోట్ల వరకు సమీకరించేందుకు ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు,

Yashoda Hospitals : ఐపీఓకు యశోద హాస్పిటల్స్‌

రూ.4,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం

ముంబై: హైదరాబాద్‌కు చెందిన యశోద హాస్పిటల్స్‌ కూడా పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఓ ద్వారా రూ.4,000 కోట్ల వరకు సమీకరించేందుకు ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు, కంపెనీ విలువ తదితర అంశాలపై ఈ హాస్పిటల్‌ నెట్‌వర్క్‌.. బ్యాంకర్లతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్స్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. ఐపీఓలో భాగంగా తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను ఉపసంహరించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం యశోద హాస్పిటల్స్‌ మొత్తం 4,000 పడకల సామర్థ్యంతో కూడిన నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు 4 హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్లు, 4 క్యాన్సర్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూట్లను నిర్వహిస్తోంది.

Updated Date - Feb 15 , 2025 | 05:37 AM