Yamaha Motor India: ఎగుమతుల్లో 25 శాతం వృద్ధి లక్ష్యం
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:37 AM
యమహా మోటార్ ఇండియా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో 25 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం చెన్నై తయారీ యూనిట్‌ను...
ముంబై: యమహా మోటార్ ఇండియా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో 25 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం చెన్నై తయారీ యూనిట్‌ను గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఛైర్మన్ ఇటారు ఒటాని తెలిపారు. ప్రస్తుతం భారత ప్లాంట్ల నుంచి 55 దేశాలకు ఎగుమతి చేస్తున్నామని, రానున్న నెలల్లో మరిన్ని దేశాలకు విస్తరించాలని చూస్తున్నట్లు ఒటాని చెప్పారు. కాగా 2024-25లో యమహా ఎగుమతులు 33.4ు వృద్ధితో 2,95,728 యూనిట్లుగా నమోదయ్యాయి.