International Office: హైదరాబాద్‌లో వైజ్ కార్యాలయం
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:43 AM
యూకేకు చెందిన ఫిన్‌టెక్ సంస్థ వైజ్.. హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ కార్యాలయాన్ని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): యూకేకు చెందిన ఫిన్‌టెక్ సంస్థ వైజ్.. హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు వైజ్ ఏపీఏసీ ఇంజనీరింగ్ హెడ్ స్మృతి రవి వెల్లడించారు. ప్రస్తుతం 70 మంది ఉద్యోగులతో ఈ సెంటర్‌ను ప్రారంభించామని, రానున్న కాలంలో మరికొంత మందిని నియమించుకోనున్నట్లు ఆమె చెప్పారు. వినియోగదారుల క్రాస్ బోర్డర్ చెల్లింపుల అవసరాలను హైదరాబాద్ సెంటర్ తీరుస్తుందన్నారు. ప్రస్తుతం వైజ్ ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా కరెన్సీల్లో లావాదేవీలను చేపడుతోందన్నారు. 2013లో కంపెనీ భారత మార్కెట్లోకి ఇన్‌వార్డ్ రెమిటెన్స్ సేవలతో అడుగుపెట్టిందని ఆమె తెలిపారు. 2021లో భారత్ నుంచి విదేశాలకు నేరుగా నగదు పంపించే (అవుట్ వార్డ్ రెమిటెన్స్) సేవలను ప్రారంభించినట్లు స్మృతి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
క్రెడిట్ కార్డు లేదా.. అయినా క్రెడిట్ స్కోరు పెరగాలంటే..
సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారి ముందున్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి