Share News

Wipro : విప్రో లాభంలో 24 శాతం వృద్ధి

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:25 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) విప్రో ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 24.4 శాతం వృద్ధితో రూ.3,354 కోట్లకు చేరుకుంది. సమీక్షా కాలానికి కంపెనీ ఆదాయం

Wipro : విప్రో లాభంలో 24 శాతం వృద్ధి

క్యూ3లో రూ.3,354 కోట్లుగా నమోదు ఒక్కో షేరుకు

రూ.6 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) విప్రో ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 24.4 శాతం వృద్ధితో రూ.3,354 కోట్లకు చేరుకుంది. సమీక్షా కాలానికి కంపెనీ ఆదాయం కేవలం 0.5 శాతం పెరిగి రూ.22,319 కోట్లుగా నమోదైంది. ఈ మార్చితో ముగియనున్న నాలుగో త్రైమాసికం(క్యూ4)లో ఐటీ సేవల ద్వారా సమకూరే ఆదాయం 260.2-265.5 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండవచ్చని విప్రో అంచనా వేసింది. క్యూ3తో పోలిస్తే క్యూ4లో ఐటీ సేవల ఆదాయ వృద్ధి మైనస్‌ 1 శాతం నుంచి ఒక శాతం శ్రేణిలో ఉండవచ్చని అంచనా. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరు కు రూ.6 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించనుంది.

12,000 నియామకాలు

వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్రాంగణ నియామకాల (క్యాంపస్‌ హైరింగ్‌) ద్వారా 10,000-12,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోనున్నట్లు విప్రో వెల్లడించింది. కాగా డిసెంబరు త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 1,157 తగ్గి 2,32,732కు పరిమితమైంది.

Updated Date - Jan 18 , 2025 | 05:25 AM