Edelweiss Mutual Fund: ఎడెల్‌వీజ్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్‌కు వాటా
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:32 AM
ఎడెల్‌వీజ్ మ్యూచువల్ ఫండ్‌లో 15ు వాటా ను అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ రూ.450 కోట్లకు..
న్యూఢిల్లీ: ఎడెల్‌వీజ్ మ్యూచువల్ ఫండ్‌లో 15ు వాటా ను అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ రూ.450 కోట్లకు కొనుగోలు చేయనుందని ఎడెల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఎ్‌ఫఎ్‌సఎల్) శుక్రవారం వెల్లడించింది. ఈ లావాదేవీలో భాగంగా కంపెనీ మొత్తం విలువను రూ.3,000 కోట్లుగా లెక్కగట్టారు. ఈఎ్‌ఫఎ్‌సఎల్ కీలక వ్యాపారాల్లో ఎడెల్‌వీజ్ మ్యూచువల్ ఫండ్ ఒకటి. ఈ జూన్ 30 నాటికి ఈ కంపెనీ రూ.1.52 లక్షల కోట్ల విలువైన ఫండ్ ఆస్తులను నిర్వహిస్తోంది. గత ఐదేళ్లలో ఆస్తుల విలువ ఏటా 44 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది.