వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ
ABN , Publish Date - Jun 10 , 2025 | 03:25 AM
వచ్చే ఏడాది కల్లా రెండు కంపెనీలుగా విడిపోనున్నట్లు అంతర్జాతీయ మీడియా దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (డబ్ల్యూబీడీ) సోమవారం ప్రకటించింది....
ఇక రెండు కంపెనీలుగా..
న్యూయార్క్: వచ్చే ఏడాది కల్లా రెండు కంపెనీలుగా విడిపోనున్నట్లు అంతర్జాతీయ మీడియా దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (డబ్ల్యూబీడీ) సోమవారం ప్రకటించింది. తన స్టూడియోలు, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని క్రమంగా ఆదరణ కోల్పోతున్న కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నుంచి విడదీయనున్నట్లు డబ్ల్యూబీడీ తెలిపింది. 2026 ప్రఽథమార్ధం చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని వెల్లడించింది. విభజనలో భాగంగా స్ట్రీమింగ్ అండ్ స్టూడియోస్ కంపెనీలో వార్నర్ బ్రదర్స్ టెలివిజన్, వార్నర్ బ్రదర్స్ మోషన్ పిక్చర్ గ్రూప్, డీసీ స్టూడియోస్, హెచ్‌బీఓ, హెచ్‌బీఓ మ్యాక్స్‌తో పాటు ఫిల్మ్, టీవీ లైబ్రరీలు భాగం కానున్నాయి. కాగా, సీఎన్‌ఎన్, టీఎన్‌టీ స్పోర్ట్స్, డిస్కవరీ, బ్లీచర్ రిపోర్ట్‌ను గ్లోబల్ కేబుల్ నెట్‌వర్క్స్ కంపెనీ కలిగి ఉండనుంది.
ఇవీ చదవండి:
రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు
ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..