Share News

వెంటాడిన యుద్ధ భయం

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:33 AM

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్‌ 138.64 పాయింట్ల నష్టంతో 81,444.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41.35 పాయింట్లు కోల్పోయి...

వెంటాడిన యుద్ధ భయం

  • 138 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్‌ 138.64 పాయింట్ల నష్టంతో 81,444.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41.35 పాయింట్లు కోల్పోయి 24,812.05 వద్ద ముగిసింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు పెరగుతుండటంతో పాటు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమై అమ్మకాలకు మొగ్గుచూపడం ఇందుకు కారణం.

  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు క్షీణించి రూ.86.43 వద్ద ముగిసింది. ఈక్విటీ నష్టాలు, క్రూడ్‌ ధరల పెరుగుదల ఇందుకు కారణం.

  • అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ ముడిచమురు పీపా ధర ఒకదశలో 77 డాలర్ల ఎగువన ట్రేడైంది.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 19 , 2025 | 05:33 AM