వొడాఫోన్ నుంచి శాట్‌కామ్ సర్వీసులు
ABN , Publish Date - Jun 19 , 2025 | 05:04 AM
పీకల్లోతు అప్పులు, నష్టాల్లో ఉన్నా వొడాఫోన్ ఐడియా కంపెనీ కూడా ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు సిద్దమవుతోంది...
న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పులు, నష్టాల్లో ఉన్నా వొడాఫోన్ ఐడియా కంపెనీ కూడా ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం ఏఎ్‌సటీ స్పేస్‌మొబైల్ అనే కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ కంపెనీకి ప్రధాన పోటీదారుగా భావిస్తారు. ఈ ఒప్పందం ద్వారా వొడాఫోన్ ఐడియా కంపెనీ వాణిజ్య, ప్రభుత్వ శాఖలకు స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఈ సేవలు అందిస్తుంది. ఎప్పటి నుంచి సేవలు ప్రారంభమయ్యేది వొడాఫోన్ ఐడియా వెల్లడించలేదు.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి