ఆరేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:33 AM
జర్మనీకి చెందిన యూపీవీసీ ఉత్పత్తుల తయారీ సంస్థ వేకా.. భారత్‌లో ఎన్‌సీఎల్ లిమిటెడ్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన ఎన్‌సీఎల్ వేకాలో వంద శాతం యాజమాన్య హక్కులను చేజిక్కించుకుంది. ఈ భాగస్వామ్య సంస్థలో

50% వాటా కొనుగోలు జర్మనీ సంస్థ వేకా వెల్లడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జర్మనీకి చెందిన యూపీవీసీ ఉత్పత్తుల తయారీ సంస్థ వేకా.. భారత్‌లో ఎన్‌సీఎల్ లిమిటెడ్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన ఎన్‌సీఎల్ వేకాలో వంద శాతం యాజమాన్య హక్కులను చేజిక్కించుకుంది. ఈ భాగస్వామ్య సంస్థలో వేకాకు 50 శాతం వాటాతో పాటు ఎన్‌సీఎల్, ఇతర వాటాదారులకు మరో 50 శాతం వాటాలున్నాయి. వ్యూహాత్మక టేకోవర్‌లో భాగంగా ఈ సంస్థలో ఎన్‌సీఎల్ సహా ఇతర వాటాదారుల నుంచి మిగిలిన 50 శాతం వాటాలను కొనుగోలు చేసినట్లు వేకా ఏజీ జర్మనీ సీఈఓ ఆండ్రెస్ హార్ట్‌లీఫ్ వెల్లడించారు. అయితే ఈ వాటాల కొనుగోలు కోసం ఎంత మొత్తం వెచ్చించారనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో అంతర్జాతీయ, భారతీయ మార్కెట్లలో కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటుందన్నారు. ప్రస్తుతం కంపెనీ హైదరాబాద్ సమీపంలోని నర్సాపూర్ వద్ద ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 28,000 టన్నులు. కాగా వచ్చే ఆరేళ్ల కాలంలో విస్తరణ కోసం రూ.100 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ఎండీ యుఎస్ మూర్తి చెప్పారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది రూ.16 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు మూర్తి తెలిపారు. ఎన్‌సీఎల్ వేకాలో