Share News

అదానీ గ్రూప్‌పై అమెరికా దర్యాప్తు

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:58 AM

గౌతమ్‌ అదానీ గ్రూప్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. గుజరాత్‌లోని తన ముంద్రా రేవు ద్వారా కొన్ని కంపెనీలు ఇరాన్‌ ఎల్‌పీజీ దిగుమతి చేసుకునేందుకు సహాకరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి....

అదానీ గ్రూప్‌పై అమెరికా దర్యాప్తు

గుట్టుగా ఇరాన్‌ ఎల్‌పీజీ దిగుమతి

తోసిపుచ్చిన అదానీ గ్రూప్‌

న్యూఢిల్లీ: గౌతమ్‌ అదానీ గ్రూప్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. గుజరాత్‌లోని తన ముంద్రా రేవు ద్వారా కొన్ని కంపెనీలు ఇరాన్‌ ఎల్‌పీజీ దిగుమతి చేసుకునేందుకు సహాకరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై అమెరికా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ప్రారంభించినట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనం ప్రచురించింది. అయితే అదానీ గ్రూప్‌ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇరాన్‌ నౌకలు ఏవీ కూడా ఎల్‌పీజీతో తమ రేవులకు రాలేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తమపై అమెరికా సంస్థలు దర్యాప్తు జరుపుతున్న విషయం కూడా తమకు తెలియదని తెలిపింది. కొన్నిసంస్థలు దురుద్దేశాలతో తమపై కావాలనే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు ప్రచారం చేస్తున్నాయని అదానీ గ్రూప్‌ తెలిపింది. ‘మా రేవుల ద్వారా ఇరాన్‌ నుంచి వచ్చే ఎలాంటి సరుకుల ఎగుమతి, దిగుమతులను అనుమతించడం లేదు. అది మా విధానపరమైన నిర్ణయం. ఇరాన్‌ జెండాతో వచ్చే నౌకలు లేదా నేరుగా ఇరాన్‌ రేవుల నుంచి వచ్చే నౌకలు అన్నిటికి ఇది వర్తిస్తుంది’ అని తెలిపింది.


ఈ విడత 0.50% వడ్డీకోత: ఎస్‌బీఐ

దేశంలో రుణ విభాగాన్ని ఉత్తేజితం చేయడంతో పాటు పలు రకాల అస్థిరతలను దీటుగా ఎదుర్కొనగల శక్తి కల్పించడం కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఈసారి అర శాతం మేరకు రెపోరేటును తగ్గించవచ్చని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. బుధవారం ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశాలు ప్రారంభమవుతాయి. శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఎంపీసీ నిర్ణయాలను ప్రకటించనున్నారు.


మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 04:58 AM