అమెరికాలో కొండెక్కిన వడ్డీ రేట్లు
ABN , Publish Date - May 23 , 2025 | 04:22 AM
అమెరికాలో వడ్డీ రేట్లు మరింత కొండెక్కాయి. ఆ దేశ కేంద్ర బ్యాంకు 20 సంవత్సరాల కాల పరిమితి ఉండే 1600 కోట్ల డాలర్ల కేంద్ర ప్రభుత్వ రుణపత్రాలను...
న్యూయార్క్: అమెరికాలో వడ్డీ రేట్లు మరింత కొండెక్కాయి. ఆ దేశ కేంద్ర బ్యాంకు 20 సంవత్సరాల కాల పరిమితి ఉండే 1600 కోట్ల డాలర్ల కేంద్ర ప్రభుత్వ రుణపత్రాలను వేలానికి పెడితే మదుపరుల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. దాంతో 30 ఏళ్ల కాలపరిమితి ఉండే ప్రభుత్వ రుణ పత్రాలపై వడ్డీరేటు 5.12 శాతానికి, ఇరవై సంవత్సరాల కాల పరిమితి ఉండే రుణ పత్రాలపై వడ్డీరేటు 5.13 శాతానికి చేరాయి. పదేళ్ల కాల పరిమితి రుణ పత్రాలపై చెల్లించే వడ్డీరేటు కూడా 4.6 శాతానికి చేరింది.
Also Read:
ఆ భావన ఇస్లాంలోనే కాదు.. హిందూమతంలోనూ ఉంది
పెద్దిరెడ్డికి హైకోర్టులో దక్కని ఊరట..
For More Telangana News and Telugu News..