Share News

Urjit Patel: ఐఎంఎఫ్‌ ఈడీగా ఉర్జిత్‌ పటేల్‌

ABN , Publish Date - Aug 30 , 2025 | 03:55 AM

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ..

Urjit Patel: ఐఎంఎఫ్‌ ఈడీగా ఉర్జిత్‌ పటేల్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న కేవీ సుబ్రమణియన్‌ను ప్రభుత్వం ఆరు నెలల ముందుగా నే తొలగించింది. ఈయన స్థానంలో పటేల్‌ను తాజాగా ప్రభుత్వం నియమించింది. కాగా పటేల్‌ గత ఏడాది జనవరి వరకు ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి పట్టాను అందుకున్న పటేల్‌ 2016 నుంచి 2018 డిసెంబరు వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 03:55 AM