Share News

ఇక 15 సెకన్లలోనే యూపీఐ చెల్లింపులు

ABN , Publish Date - May 02 , 2025 | 03:04 AM

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిపే యూపీఐ చెల్లింపుల ప్రక్రియ మరింత త్వరితం కానుంది. ప్రస్తుతం ఒక్కో యూపీఐ చెల్లింపు లావాదేవీ పూర్తయ్యేందుకు 30 సెకన్లు పడుతోంది...

ఇక 15 సెకన్లలోనే యూపీఐ చెల్లింపులు

జూన్‌ 16 నుంచి అమలు

న్యూఢిల్లీ: డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిపే యూపీఐ చెల్లింపుల ప్రక్రియ మరింత త్వరితం కానుంది. ప్రస్తుతం ఒక్కో యూపీఐ చెల్లింపు లావాదేవీ పూర్తయ్యేందుకు 30 సెకన్లు పడుతోంది. వచ్చే నెల 16 నుంచి ఇది 15 సెకన్లకు తగ్గనుంది. దీనికి సంబంధించి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) గురువారం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందుకనుగుణంగా తమ వ్యవస్థలను సిద్ధం (అప్‌డేట్‌) చేసుకోవాలని బ్యాంకులు, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఎన్‌పీసీఐ ఆదేశించింది. మరోవైపు చెల్లింపులు, బదిలీలు, బ్యాలెన్స్‌ చెక్‌, పిన్‌ మార్పు వంటి ఏపీఐ రెస్పాన్స్‌ టైమ్‌ను బ్యాంకులు, పేమెంట్‌ యాప్స్‌ ఇక నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి. లేకపోతే చర్యలు తప్పవని ఎన్‌పీసీఐ హెచ్చరించింది.


పెంచిన ఏటీఎం చార్జీలు అమలు షురూ

ఏటీఎం చార్జీల పెంపుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశాలు గురువారం నుంచి అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం ఒక నెలలో ఉచితంగా విత్‌డ్రా చేసుకునేందుకు ఇచ్చిన పరిమితి దాటితే చేసే ఒక్కో లావాదేవీపై బ్యాంకులు రూ.23 చార్జీ చేయనున్నాయి. గతంలో ఈ చార్జీ రూ.21 ఉండేది. ఒక్కో లావాదేవీపై రూ.2 పెంచుకునేందుకు బ్యాంకులను అనుమతిస్తూ మార్చి 28న ఆర్‌బీఐ సర్క్యులర్‌ జారీ చేసింది. కస్టమర్ల ఖాతా ఉన్న బ్యాంక్‌ ఏటీఎంలలో ఉచిత లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేతర) పరిమితి మెట్రో నగరాల్లో అయితే నెలకి మూడు కాగా నాన్‌ మెట్రో నగరాల్లో అయితే ఐదుగా ఉంది.

ఇవి కూడా చదవండి

Viral Video: పెళ్లికి ముందు అనుకోని సంఘటన.. మండపంగా మారిన ఆస్పత్రి..

Vijay Devarakonda: ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్.. హీరో విజయ్ దేవరకొండపై కేసు

Updated Date - May 01 , 2025 | 09:49 PM

Updated Date - May 02 , 2025 | 03:04 AM