GST Rules For Returning Goods: కొనుగోలు చేసిన సరుకు వెనక్కు పంపుతుంటే
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:18 AM
వ్యాపార లావాదేవీల్లో కొనుగోలు చేసిన సరుకును సరఫరాదారునికి వెనక్కు పంపటం అనేది సర్వ సాధారణం. ఇది ఒక వ్యాపారి నుంచి డిస్ట్రిబ్యూటర్‌కు కావచ్చు లేదా ఒక వ్యాపారి లేదా డిస్ట్రిబ్యూటర్ నుంచి ఉత్పత్తిదారులకు...
వ్యాపార లావాదేవీల్లో కొనుగోలు చేసిన సరుకును సరఫరాదారునికి వెనక్కు పంపటం అనేది సర్వ సాధారణం. ఇది ఒక వ్యాపారి నుంచి డిస్ట్రిబ్యూటర్‌కు కావచ్చు లేదా ఒక వ్యాపారి లేదా డిస్ట్రిబ్యూటర్ నుంచి ఉత్పత్తిదారులకు కావచ్చు. ఈ విధంగా సరుకు వెనక్కు పంపటానికి వివిధ కారణాలు ఉండవచ్చు. వచ్చిన సరుకులో నాణ్యతాపరమైన లోపాలు ఉండటం ఒక కారణమైతే, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను ఉత్పత్తి దారులు కొత్త ప్రొడక్ట్ తయారు చేసిన ప్రతిసారి ఆయా ఉత్పత్తులను డిస్ట్రిబ్యూటర్లకు పంపుతుంటారు. ఆయా వస్తువులు అమ్ముడుపోకపోతే తిరిగి వెనక్కు పంపవచ్చనే షరతు మీద. అలాగే అమ్ముడుపోని సరుకును కొంతకాలం తర్వాత వెనక్కు పంపించటం జరుగుతుంది. అదే విధంగా సీజన్ ప్రకారం వ్యాపారం జరిగే ఎరువులు, పురుగు మందుల వ్యాపారంలో కూడా సీజన్ ముగిసే నాటికి మిగిలిన సరుకును వెనక్కు పంపిస్తుంటారు. ఇలా సరుకు వెనక్కు పంపటమనేది ఆయా సరఫరాదారులు, కొనుగోలుదారుల అవగాహన మేరకు జరుగుతుంది. అయితే ఇలా సరుకు వెనక్కు పంపేటప్పుడు జీఎ్‌సటీకి సంబంధించి సరఫరాదారులు, కొనుగోలుదారులు పాటించాల్సిన నియమ నిబంధనలు ఉన్నాయి. కొనుగోలు చేసిన సరుకు వెనక్కు పంపటానికి రెండు రకాల పద్దతులు ఉన్నాయి. అవేమిటంటే..
మొదటిది, సరఫరాదారుడు.. కొనుగోలుదారునికి వెనక్కు పంపే సరుకు విలువ, దానికి సంబంధించిన జీఎ్‌సటీతో ఒక క్రెడిట్ నోట్ జారీ చేస్తాడు. ఇప్పుడు కొనుగోలుదారుడు ఆ క్రెడిట్ నోట్ ఆధారంగా డెలివరీ చలాన్ మీద సరుకు వెనక్కు పంపాలి. ఇలా పంపేటప్పుడు ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు. కానీ, వెనక్కు పంపే సరుకుకు సంబంధించి ఇంతకు ముందు తీసుకున్న ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను రివర్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే నియమ నిబంధనల మేర పంపే సరుకుకు ఎలకా్ట్రనిక్ (ఈ)- వే బిల్ ఉండాలి.
అయితే, సరఫరాదారుడు క్రెడిట్ నోట్‌ను జారీ చేయటానికి ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. ఎందుకంటే క్రెడిట్ నోట్‌లో మొదట సరుకును ఏ ఇన్వాయి్‌సలో పంపారో ఆ ఇన్వాయిస్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని సందర్భాల్లో ఇలా ఇన్వాయి్‌సతో మ్యాచ్ చేయటం కుదరకపోవచ్చు. అలాగే, సరఫరాదారుడు తాను జారీ చేసిన క్రెడిట్ నోట్ విలువను తగ్గించుకోవటానికి కాలపరిమితి ఉంది. ఆ సమయం దాటితే విలువను తగ్గించుకోవటం కుదరదు. కాబట్టి క్రెడిట్ నోట్‌ను జారీ చేసినా దానికి సంబంధించిన ప్రయోజనం పొందలేడు.
అలాగే కొనుగోలుదారుడికి కూడా ఎంత రివర్స్ చేయాలో ఒక్కొక్కసారి అర్ధం కాదు. ఇలాంటప్పుడు రెండో పద్దతి పాటించవచ్చు. ఇందులో వెనక్కు పంపే సరుకును కొత్త సరఫరా కింద భావించాలి. అంటే వ్యాపారి తాను వెనక్కు పంపే సరుకును అమ్మకం కింద చూపుతూ ఒక ఇన్వాయిస్ జారీ చేయటంతో పాటుగా దానికి సంబంధించిన పన్ను చెల్లించాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సరుకు అమ్మేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయో అన్నీ పాటించాలి. అంటే, క్రెడిట్ రివర్స్ చేసే బదులు కొత్తగా పన్ను కడుతున్నాడన్న మాట. అలాగే సరుకును వెనక్కు పొందిన తర్వాత సదరు డిస్ట్రిబ్యూటర్ లేదా ఉత్పత్తిదారుడు దానిని కొనుగోలుగా భావించి ఆ ఇన్వాయిస్ మీద ఉన్న ట్యాక్స్ మొత్తాన్ని ఇన్‌పుట్ కింద తీసుకోవచ్చు. అంటే ఈ రెండో పద్దతిలో సరుకు వెనక్కు పంపే వ్యక్తి అమ్మకందారుడుగా, సరుకును వెనక్కు పొందే వ్యక్తి అంటే సరుకు మొదట పంపిన వ్యక్తి కొనుగోలుదారుడిగా వ్యవహరిస్తారు. కానీ, చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే సరఫరాదారుడు క్రెడిట్ నోట్‌ను జారీ చేయటం, అలాగే కొనుగోలుదారుడు ఇన్వాయిస్ ఇవ్వటం రెండు కలిపి చేస్తుంటారు. ఇలా రెండు పద్దతులు కలపటం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు పద్దతుల్లో ఏదో ఒక పద్దతి పాటిస్తే సరఫరాదారుడికి, కొనుగోలుదారుడికి సులువుగా ఉంటుంది.
రాంబాబు గొండాల
ఇవి కూడా చదవండ
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్
కెప్టెన్‌గా జేమ్స్ అండర్సన్.. 43 ఏళ్ల వయసులో!