బిల్ టు, షిప్ టు అంటే ?
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:12 AM
కిరణ్ ఖమ్మంలో ఒక ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. సాధారణంగా తనకు కావాల్సిన సరుకును హైదరాబాద్‌లోని హోల్‌సేల్ వ్యాపారి నుంచి తెప్పించుకుంటాడు. సదరు హోల్‌సేల్ వ్యాపారి...
కిరణ్ ఖమ్మంలో ఒక ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. సాధారణంగా తనకు కావాల్సిన సరుకును హైదరాబాద్‌లోని హోల్‌సేల్ వ్యాపారి నుంచి తెప్పించుకుంటాడు. సదరు హోల్‌సేల్ వ్యాపారి సాధారణంగా సరుకును తమ వద్ద నుంచే కిరణ్‌కు నేరుగా పంపుతుంటాడు. ఒక సందర్భంలో కిరణ్ కొంత సరుకును అత్యవసరంగా పంపాలని కోరటం జరిగింది. సమయానికి సదరు హోల్‌సేల్ వ్యాపారి వద్ద కిరణ్ అడిగిన వస్తువులు అందుబాటులో లేవు. సాధారణంగా వ్యాపారస్తులు తమ కస్టమర్లు అడిగిన సరుకు తమ వద్ద లేకపోతే వేరే చోట నుంచి తామే తెప్పించి ఇస్తుంటారు. అంతేగానీ ఆర్డర్‌ను రద్దు చేసుకోరు. సరుకు అదే ఊరిలోని వేరే దుకాణంలో కొన్నప్పటికీ ముందుగా తమ వద్దకు తెచ్చుకుని తమ ద్వారానే రవాణా జరిగేట్లు చూసుకుంటారు. అయితే ఈసారి ఆర్డర్‌లోని వస్తువులు తమ వద్ద లేకపోవటంతో పాటుగా డెలివరీ అత్యవసరం కావటంతో హైదరాబాద్ వ్యాపారి ఆ సరుకును విజయవాడలో తనకు పరిచయం ఉన్న మరొక హోల్‌సేల్ దుకాణం నుంచి సర్దుబాటు చేయటం జరిగింది. అంటే కిరణ్ ఆర్డర్ పెట్టింది హైదరాబాద్ వ్యాపారికి. కాగా సరుకు విజయవాడ నుంచి వస్తుంది. అయితే, కిరణ్‌కు విజయవాడ వ్యాపారికి ఎలాంటి సంబంధం లేదు. తాను చెల్లించాల్సిన మొత్తం హైదరాబాద్ వ్యాపారికే చెల్లిస్తాడు. తనకు సరుకు అందించాల్సిన బాధ్యత కూడా హైదరాబాద్ వ్యాపారిదే. కాబట్టి సరుకు విజయవాడ నుంచి వచ్చినప్పటికీ, కిరణ్‌కు ఇవ్వాల్సిన ఇన్వాయిస్ హైదరాబాద్ వ్యాపారే ఇవ్వాలి. అలాగే విజయవాడ వ్యాపారికి సంబంధించి తనకు కిరణ్‌తో ఎలాంటి సంబంధం లేదు. తనకు రావాల్సిన మొత్తం హైదరాబాద్ వ్యాపారి నుంచే రావాలి. ఇన్వాయిస్ కూడా హైదరాబాద్ వ్యాపారి పేరు మీదే ఇస్తాడు. మరి ఇలాంటప్పుడు సరుకు ఎలా పంపాలి?
అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ పోయి అక్కడి నుంచి తిరిగి ఖమ్మం రావటానికి రవాణా ఖర్చులు అధికం కావటమే కాకుండా సమయం కూడా వృధా అవుతుంది. కాబట్టి హైదరాబాద్ వ్యాపారి ఆ సరుకును నేరుగా ఖమ్మం పంపేటట్లు విజయవాడ వ్యాపారికి తగు ఆదేశాలు ఇచ్చాడు. మరి ఈ లావాదేవీని జీఎ్‌సటీలో ఎలా చూపాలి?
ఈ విధమైన లావాదేవీలు వ్యాపార వర్గాల్లో సర్వసాధారణం. అంటే ఆర్డర్ ఒకరికి ఇస్తే సరుకు వేరొక చోటు నుంచి రావచ్చు. ఒక్కొక్కసారి సరుకు నేరుగా అంతిమ కొనుగోలుదారునికి డెలివరీ జరిగినప్పటికీ మధ్యలో చాలా మంది ఉండవచ్చు. ఇలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీఎ్‌సటీలో ఒక వెసులుబాటు కల్పించటం జరిగింది. దీన్నే ‘బిల్ టు, షిప్ టు’ అని అంటారు. అంటే సరుకు ఎవరికి అమ్ముతున్నారో బిల్ లేదా ఇన్వాయిస్ వారి పేరు మీద ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ‘బిల్ టు’ అంటారు. సరుకు డెలివరీ జరిగే ప్రదేశాన్ని ‘షిప్ టు’ అంటారు. అయితే దీన్ని జాగ్రత్తగా అమలు చేయాల్సి ఉంటుంది.
అంటే ఈ విధానంలో ముందుగా ఒక లావాదేవీకి సంబంధించి నిజమైన అమ్మకందారుడు, కొనుగోలుదారుడిని గుర్తించాలి. దాన్ని బట్టి ఆ సరఫరా రాష్ట్ర అంతర్గత సరఫరా లేదా అంతర్ రాష్ట్ర సరఫరానా అనేది గుర్తించాలి. ఎందుకంటే దాన్ని బట్టే వర్తకుడు ఐజీఎ్‌సటీ చెల్లించాలా లేదా సీజీఎ్‌సటీ, ఎస్‌జీఎ్‌సటీ చెల్లించాలా? అనేది దీన్ని బట్టే నిర్ణయించాలి.
పై ఉదాహరణలో సరుకు విజయవాడ నుంచి వచ్చినప్పటికీ, కిరణ్‌కు సంబంధించి అమ్మకందారుడు హైదరాబాద్ వ్యాపారే. అంటే హైదరాబాద్ వ్యాపారి.. ఖమ్మంలోని కిరణ్‌కు సరుకు అమ్ముతున్నట్లు లెక్క (సరుకు ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ). కాబట్టి, హైదరాబాద్ వ్యాపారి ఖమ్మంలోని కిరణ్ పేరు మీద ఇన్వాయిస్ జారీ చేయాలి. ఈ రెండు ప్రదేశాలు తెలంగాణలోనే ఉన్నాయి కాబట్టి ఈ సరఫరా రాష్ట్ర అంతర్గత సరఫరా కింద భావించి సీజీఎస్‌టీ, ఎస్‌జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విజయవాడ వ్యాపారికి సంబంధించి కొనుగోలుదారుడు హైదరాబాద్ వ్యాపారి అవుతాడు (సరుకు ఎక్కడకు పంపినప్పటికీ). కాబట్టి హైదరాబాద్ వ్యాపారి పేరు మీద ఇన్వాయిస్ జారీ చేయాలి. అంటే లెక్క ప్రకారం సరుకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నట్లుగా భావించాలి. ఈ రెండు ప్రదేశాలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి ఐజీఎ్‌సటీ చెల్లించాలి. తాను ఇచ్చే ఇన్వాయిస్ మీద ‘బిల్ టు’ లో హైదరాబాద్ వ్యాపారి పేరు, చిరునామా చూపాలి. ‘షిప్ టు’లో కిరణ్ చిరునామా చూపాలి. అలాగే ఈ-వే బిల్ జారీ చేయాల్సి వస్తే, అందులో కూడా బిల్ టు, షిప్ టు విధిగా చూపాలి. విజయవాడ వ్యాపారి ఇచ్చిన ఇన్వాయిస్ ఆధారంగా హైదరాబాద్ వ్యాపారి ఐటీసీ తీసుకోవాల్సి ఉండగా, హైదరాబాద్ వ్యాపారి ఇచ్చిన ఇన్వాయిస్ ఆధారంగా కిరణ్ ఐటీసీ తీసుకోవాల్సి ఉంటుంది.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
Read More Business News and Latest Telugu News