మూడింట రెండొంతుల పన్ను రిటర్నుల్లో చెల్లింపులు నిల్లు
ABN , Publish Date - Feb 12 , 2025 | 03:20 AM
ఆదాయం పన్ను (ఐటీ) రిటర్న్‌లు సమర్పించే వారిలో మూడింట రెండొంతుల మంది చెల్లించిన పన్ను సున్నా అని కేంద్రం వెల్లడించింది. వీరి సంఖ్య 2019-20 ఆర్థికతో పోలిస్తే...

న్యూఢిల్లీ: ఆదాయం పన్ను (ఐటీ) రిటర్న్‌లు సమర్పించే వారిలో మూడింట రెండొంతుల మంది చెల్లించిన పన్ను సున్నా అని కేంద్రం వెల్లడించింది. వీరి సంఖ్య 2019-20 ఆర్థికతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు రెట్టింపైంది. లోక్‌సభలో పన్ను చెల్లింపుదారులపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మంత్రి సమర్పించిన డేటా ప్రకారం.. 2019-20లో 6.48 కోట్ల మంది ఐటీ రిటర్న్‌లు సమర్పించగా.. అందులో సున్నా పన్ను బకాయితో దాఖలైన రిటర్నులు 2.9 కోట్లు. అంటే మొత్తం రిటర్న్‌ల్లో 44.75 శాతానికి సమానం. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు 31 నాటికి 8.39 కోట్ల మంది రిటర్న్‌లు ఫైల్ చేశారు. అందులో 5.58 కోట్ల(66.5 శాతం) మంది సున్నా పన్ను బకాయితో రిటర్న్‌లు సమర్పించినట్లు మంత్రి తెలిపారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For Telangana News And Telugu News