Share News

TTK Prestige Chairman: టీటీకే ప్రెస్టీజ్‌ ఎమిరిటస్‌ చైర్మన్‌ టీటీ జగన్నాథన్‌ కన్నుమూత

ABN , Publish Date - Oct 11 , 2025 | 04:53 AM

కిచెన్‌ మొఘల్‌గా సుప్రసిద్ధుడైన టీటీకే ప్రెస్టీజ్‌ ఎమిరిటస్‌ చైర్మన్‌ టీటీ జగన్నాథన్‌ శుక్రవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 77 సంవత్సరాలు...

TTK Prestige Chairman: టీటీకే  ప్రెస్టీజ్‌ ఎమిరిటస్‌ చైర్మన్‌ టీటీ జగన్నాథన్‌ కన్నుమూత

న్యూఢిల్లీ: కిచెన్‌ మొఘల్‌గా సుప్రసిద్ధుడైన టీటీకే ప్రెస్టీజ్‌ ఎమిరిటస్‌ చైర్మన్‌ టీటీ జగన్నాథన్‌ శుక్రవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. ఆయన చెన్నై ఐఐటీ గోల్డ్‌ మెడలిస్ట్‌ కావడమే కాకుండా కార్నెల్‌ యూనివర్శిటీ డాక్టరేట్‌ కూడా పొందారు. గత 50 సంవత్సరాలుగా ఆయన తన తాత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి స్థాపించిన టీటీకే ప్రెస్టిజ్‌ కంపెనీ బోర్డులో ఉన్నారు. 1975లో టీటీకే ప్రెస్టీజ్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టిన జగన్నాథన్‌ 2000 సంవత్సరం వరకు అదే పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2019 వరకు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఉన్నారు. అనంతరం నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌/చైర్మన్‌గా కొనసాగారు. ఈ ఏడాది మార్చి 25న చైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దివాలా దశలో ఉన్న టీటీకే ప్రెస్టీజ్‌ కంపెనీని బిలియన్‌ డాలర్‌ కంపెనీగా తీర్చిదిద్దటంలో జగన్నాథన్‌ కీలక పాత్ర పోషించారు. ఆయన సారథ్యంలో కంపెనీ విభిన్న ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం ద్వారా చిన్న గృహోపకరణాల విభాగంలో అగ్రగామిగా నిలిచింది.

ఈ వార్తలు కూడా చదవండి..

పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..

Updated Date - Oct 11 , 2025 | 04:53 AM