Broadcasting Service : ఇక సెట్ టాప్ బాక్స్‌ల పోర్టబిలిటీ!
ABN , First Publish Date - 2025-02-22T04:28:59+05:30 IST
సెట్ టాప్ బాక్స్‌ల్లోనూ ఇంటారాపరబిలిటీ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) సిఫారసు చేసింది.
న్యూఢిల్లీ: మొబైల్ నంబర్ పోర్టబిలిటీ తరహాలో సెట్ టాప్ బాక్స్‌ల్లోనూ ఇంటారాపరబిలిటీ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) సిఫారసు చేసింది. బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లు తమ మౌలిక సదుపాయాలను పరస్పరం పంచుకోవాలని, ఐపీటీవీ సర్వీస్ ప్రొవైడర్లకు కనీస నెట్‌వర్త్ పరిమితిని సైతం తగ్గించాలని ట్రాయ్ సిఫారసు చేసింది. సెట్ టాప్ బాక్స్‌ల్లో పోర్టబిలిటీ సదుపాయం అందుబాటులోకి వస్తే, కస్టమర్లు ఇతర బ్రాడ్‌కాస్టింగ్ సేవలకు మారినప్పుడు సెట్ టాప్ బాక్స్‌ను కూడా మార్చుకోవాల్సిన బెడద తప్పుతుంది.