Share News

TRAI Directs Banks: మోసాల కట్టడికి 1600 సిరీస్‌ ఫోన్‌ నంబర్లు

ABN , Publish Date - Nov 20 , 2025 | 06:12 AM

మోసపూరిత ఫోన్‌ కాల్స్‌ ద్వారా జరిగే ఆర్థిక నేరాల కట్టడికి ట్రాయ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ, సెబీ, పీఎ్‌ఫఆర్‌డీఏ వంటి నియంత్రణ సంస్థల పరిధిలోని బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా (బీఎ్‌ఫఎస్‌ఐ) కంపెనీలు...

TRAI Directs Banks: మోసాల కట్టడికి 1600 సిరీస్‌ ఫోన్‌ నంబర్లు

బ్యాంకులు జనవరి 1 నుంచే అమలు చేయాలి జూ ట్రాయ్‌ ఉత్తర్వులు

న్యూఢిల్లీ: మోసపూరిత ఫోన్‌ కాల్స్‌ ద్వారా జరిగే ఆర్థిక నేరాల కట్టడికి ట్రాయ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ, సెబీ, పీఎ్‌ఫఆర్‌డీఏ వంటి నియంత్రణ సంస్థల పరిధిలోని బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా (బీఎ్‌ఫఎస్‌ఐ) కంపెనీలు తమ కస్టమర్లకు చేసే సర్వీస్‌, లావాదేవీల ఫోన్‌ కాల్స్‌ కోసం తప్పనిసరిగా 1600 నంబర్‌ సిరీస్‌ ఫోన్‌ నంబర్లు మాత్రమే వాడాలని ఆదేశించింది. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, ఎన్‌బీఎ్‌ఫసీలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.

ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులు ఈ నిబంధనలను వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచే అమలు చేయాలని ట్రాయ్‌ ఆదేశించింది. వాయిస్‌ కాల్స్‌ ద్వారా జరిగే ఆర్థిక మోసాలను కట్టడి చేసేందుకు ట్రాయ్‌ ఈ చర్య తీసుకుంది. దీంతో ఏది మోసపూరిత కాల్‌, ఏది నిజమైన కాల్‌ అని తెలుకునే అవకాశం ఈ సంస్థల ఖాతాదారులకు ఏర్పడనుంది. కాగా ఐఆర్‌డీఏతో జరుగుతున్న చర్చలు పూర్తయ్యాక బీమా కంపెనీలకూ ఈ సీరీస్‌ వర్తిస్తుందని ట్రాయ్‌ తెలిపింది. ట్రాయ్‌ ఆదేశాల ప్రకారం ఈ దిగువ సంస్థలు ఆయా తేదీల నుంచి 1600 సిరీస్‌ ఫోన్‌ నంబర్లు అమలు చేయాలి.

  • మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి.

  • క్వాలిఫైడ్‌ స్టాక్‌ బ్రోకర్లకు మార్చి 15, 2026 నుంచి.

  • ఆర్‌బీఐ నియంత్రణలోకి వచ్చే పెద్ద ఎన్‌బీఎ్‌ఫసీలు, పేమెంట్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు లు (ఎస్‌ఎ్‌ఫబీ) వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 లోగా.

  • ఇతర ఎన్‌బీఎ్‌ఫసీలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇతర చిన్న సంస్థలు 2026 మార్చి 1 నుంచి.

  • కేంద్రీయ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీలు, పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15లోగా.

ఇవి కూడా చదవండి..

ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..

టీవీకే సభ్యులకు క్యూ ఆర్‌ కోడ్‌తో గుర్తింపు కార్డులు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 20 , 2025 | 06:55 AM