మార్కెట్లో మళ్లీ వాణిజ్య యుద్ధ భయాలు
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:48 AM
దేశీయ స్టాక్ మార్కెట్లను మళ్లీ వాణిజ్య, యుద్ధ భయాలు అలుముకున్నాయి. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను రెట్టింపు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఈ మధ్యనే...
సెన్సెక్స్ 77 పాయింట్లు డౌన్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లను మళ్లీ వాణిజ్య, యుద్ధ భయాలు అలుముకున్నాయి. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను రెట్టింపు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఈ మధ్యనే కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ అమెరికా-చైనా పరస్పర ఆరోపణలు, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మళ్లీ తీవ్రతరం కావడం, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు ట్రేడింగ్ సెంటిమెంట్‌కు గండికొట్టాయి. దాంతో సోమవారం సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో 796.75 పాయింట్లు క్షీణించి 80,654 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత క్రమంగా కోలుకున్న సూచీ చివరికి 77.26 పాయింట్ల నష్టంతో 81,373.75 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ప్రారంభంలో 224.55 పాయింట్ల వరకు కోల్పోయినప్పటికీ, చివరికి 34.10 పాయింట్ల నష్టంతో 24,716.60 వద్ద స్థిరపడింది. గత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి ప్రభు త్వ అంచనాలకు అనుగుణంగా 6.5 శాతంగా నమోదవడంతో పాటు జీఎ్‌సటీ వసూళ్లు వరుసగా రెండో నెలా రూ.2 లక్షల కోట్లు దాటడం, ఈసారి ఆర్‌బీఐ రెపో రేటును అర శాతం వర కు తగ్గించవచ్చన్న అంచనాలు సూచీల రికవరీకి తోడ్పడ్డాయి.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి