Share News

బ్రాండ్‌ బాజా

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:30 AM

బ్రాండ్‌ వాల్యూ విషయంలో మన దేశీయ కంపెనీలూ సత్తా చాటుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లోని టాప్‌-100 కంపెనీల బ్రాండ్‌ వాల్యూ 23,650 కోట్ల డాలర్ల (సుమారు రూ.20.27 లక్షల కోట్లు) వరకు...

బ్రాండ్‌ బాజా

సత్తా చాటుతున్న దేశీయ కంపెనీల బ్రాండ్లు

  • టాప్‌-100 బ్రాండ్స్‌ విలువ రూ.20.27 లక్షల కోట్లు

  • అగ్రస్థానంలో టాటా బ్రాండ్‌ : బ్రాండ్‌ ఫైనాన్స్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: బ్రాండ్‌ వాల్యూ విషయంలో మన దేశీయ కంపెనీలూ సత్తా చాటుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లోని టాప్‌-100 కంపెనీల బ్రాండ్‌ వాల్యూ 23,650 కోట్ల డాలర్ల (సుమారు రూ.20.27 లక్షల కోట్లు) వరకు ఉంటుందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇండియా సంస్థ ఒక నివేదికలో తెలిపింది. ఇందులో టాటా గ్రూప్‌ బ్రాండ్‌ విలువే 3,160 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.78 లక్షల కోట్లు) మేర ఉందని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం టాటా గ్రూప్‌ బ్రాండ్‌ విలువ 10 శాతం పెరిగింది. బ్రాండ్‌ వాల్యూ 3,000 కోట్ల డాలర్లకు మించిన తొలి భారత పాశ్రామిక గ్రూప్‌ కూడా టాటా గ్రూపేనని బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇండియా తెలిపింది. బ్రాండ్‌ వాల్యూపరంగా టాటా గ్రూప్‌ తర్వాత ఇన్ఫోసిస్‌ (1,630 కోట్ల డాలర్లు), హెచ్‌డీఎ్‌ఫసీ గ్రూప్‌ (1,420 కోట్ల డాలర్లు), ఎల్‌ఐసీ (1,360 కోట్ల డాలర్లు), రిలయన్స్‌ గ్రూప్‌ (980 కోట్ల డాలర్లు), ఎస్‌బీఐ గ్రూప్‌ (960 కోట్ల డాలర్లు), హెచ్‌సీఎల్‌ టెక్‌ (890 కోట్ల డాలర్లు), ఎయిర్‌టెల్‌ (770 కోట్ల డాలర్లు), ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌ (740 కోట్ల డాలర్లు), మహీంద్రా గ్రూప్‌ (720 కోట్ల డాలర్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


దూకుడుగా అదానీ గ్రూప్‌

ఇక వేగంగా బ్రాండ్‌ వాల్యూ పెంచుకుంటున్న పారిశ్రామిక సంస్థల్లో అదానీ గ్రూప్‌ అగ్రస్థానంలో ఉంది. గత సంవత్సర కాలంలో ఈ గ్రూప్‌ బ్రాండ్‌ వాల్యూ 82 శాతం పెరిగింది. కంపెనీ ల పరంగా చూస్తే తాజ్‌ హోటల్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అమూల్‌ ముందున్నాయి.

పటిష్ఠమైన టాప్‌-10 బ్రాండ్‌ కంపెనీలు

కంపెనీ పేరు పాయింట్ల వారీగా

తాజ్‌ హోటల్స్‌ 92.2

ఏషియన్‌ పెయింట్స్‌ 92.0

అమూల్‌ 91.2

హీరో 91.0

తనిష్క్‌ 90.0

మారుతి సుజుకీ 89.1

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 88.7

ఎల్‌ఐసీ గ్రూప్‌ 87.6

ఇండిగో 87.6

హెచ్‌డీఎ్‌ఫసీ గ్రూప్‌ 86.4

ఇవి కూడా చదవండి..

వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే.. పూర్తి చేశారా లేదా..

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 27 , 2025 | 05:50 AM