Share News

భారత్‌ నుంచి బ్రిటన్‌ దోచుకున్న సొమ్ము రూ.5,607 లక్షల కోట్లు

ABN , Publish Date - Jan 21 , 2025 | 06:46 AM

శతాబ్దకాలానికి పైగా భారత్‌ను పాలించిన బ్రిటన్‌ మన దేశ సంపదను భారీగా కొల్లగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. భారత్‌ నుంచి బ్రిటన్‌ ఎంత మేర దోచుకుందనే విషయంపై ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ బయటపెట్టింది...

భారత్‌ నుంచి బ్రిటన్‌ దోచుకున్న సొమ్ము రూ.5,607 లక్షల కోట్లు

  • అందులో సగం 10 శాతం సంపన్నుల చేతుల్లోకే..

  • జూఆ డబ్బుతో లండన్‌ ఉపరితల భాగాన్ని

    50 పౌండ్ల నోట్లతో నాలుగు సార్లు కప్పేయొచ్చు..

దావోస్‌: శతాబ్దకాలానికి పైగా భారత్‌ను పాలించిన బ్రిటన్‌ మన దేశ సంపదను భారీగా కొల్లగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. భారత్‌ నుంచి బ్రిటన్‌ ఎంత మేర దోచుకుందనే విషయంపై ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ బయటపెట్టింది. 1765 నుంచి 1900 మధ్య కాలంలో జరిగిన వలస పాలనలో బ్రిటన్‌ మన దేశం నుంచి ప్రస్తుత విలువ ప్రకారం 64.82 లక్షల కోట్లు డాలర్లు (సుమారు రూ.5,607 లక్షల కోట్లు) దోచుకుందని ఆక్స్‌ఫామ్‌ తాజా నివేదిక అంచనా వేసింది. అందులో 52 శాతం.. అంటే 33.8 లక్షల కోట్ల డాలర్లు (రూ.2,924 లక్షల కోట్లు) 10 శాతం సంపన్నుల జేబుల్లోకే వెళ్లిందని నివేదిక పేర్కొంది. ఆ డబ్బుతో బ్రిటన్‌ రాజధాని లండన్‌ ఉపరితల భాగాన్ని 50 పౌండ్ల నోట్లతో నాలుగు సార్లు కప్పేయవచ్చని అంటోంది. ప్రస్తుతం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని చాలావరకు కుబేర కుటుంబాల సంపద వలసపాలన సమయంలో ఆర్జించిందేనని రిపోర్టు పేర్కొంది. 1750లో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 25 శాతం వాటా భారత ఉపఖండానిదేనని, 1900 నాటికది 2 శాతానికి పడిపోయిందని ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడించింది.

Updated Date - Jan 21 , 2025 | 06:46 AM