Share News

ఆసియా కుబేరులు అంబానీలే

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:32 AM

ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్తల కుటుంబంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబం నిలిచింది. అంబానీ కుటుంబం 9,050 కోట్ల డాలర్ల (రూ.7.87 లక్షల కోట్లు) సంపదతో...

ఆసియా కుబేరులు అంబానీలే

బ్లూంబర్గ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్తల కుటుంబంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబం నిలిచింది. అంబానీ కుటుంబం 9,050 కోట్ల డాలర్ల (రూ.7.87 లక్షల కోట్లు) సంపదతో ఆసియాలో అమిత సంపన్నులైన 20 కుటుంబాల్లో అగ్రస్థానంలో నిలిచినట్టు బ్లూంబర్గ్‌ ప్రకటించింది. ఆసియాకు చెందిన మరెన్నో కుటుంబాలు ఆయన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆసియా సంపన్న వ్యాపార సామ్రాజ్యాల్లో ఎనర్జీ, టెక్నాలజీ, ఫైనాన్స్‌ వంటి భిన్న రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలున్నాయి. 2002లో సంస్థ వ్యవస్థాపకుడు ధీరూభాయ్‌ అంబానీ మరణానంతరం ముకేశ్‌ ఆర్‌ఐఎల్‌ పగ్గాలు చేపట్టారు. ఒకప్పుడు ఆయిల్‌ రిఫైనింగ్‌ రంగంలో కార్యకలాపాలు సాగించే సంస్థగా ఉన్న రిలయన్స్‌ టెక్నాలజీ, వినియోగ వస్తువులు, ఆర్థిక సర్వీసులు వంటి రంగాలకు విస్తరించడంతో పాటు ఇటీవలే హరిత ఇంధన విభాగంలోకి కూడా ప్రవేశించింది. కాగా ఈ జాబితాలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌, ఓపీ జిందాల్‌ గ్రూప్‌ ,బజాజ్‌ గ్రూప్‌, హిందూజా గ్రూప్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఉన్నాయి.


For Business News And Telugu News

Updated Date - Feb 14 , 2025 | 01:32 AM