Nifty Technical Analysis: 26000 వద్ద నిలదొక్కుకోవడం కీలకం
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:46 AM
గత వారం నిఫ్టీ 25,500 వద్ద ప్రారంభమై అన్ని సెషన్లలోనూ అప్‌ట్రెండ్‌లోనే ట్రేడయినా 26,000 వద్ద మైనర్ రియాక్షన్ సాధించింది. చివరికి ముందు వారంతో పోల్చితే 417 పాయింట్ల లాభంతో 25,900 వద్ద ముగిసింది.
టెక్ వ్యూ: 26,000 వద్ద నిలదొక్కుకోవడం కీలకం
గత వారం నిఫ్టీ 25,500 వద్ద ప్రారంభమై అన్ని సెషన్లలోనూ అప్‌ట్రెండ్‌లోనే ట్రేడయినా 26,000 వద్ద మైనర్ రియాక్షన్ సాధించింది. చివరికి ముందు వారంతో పోల్చితే 417 పాయింట్ల లాభంతో 25,900 వద్ద ముగిసింది. మరోసారి కీలక స్థాయి 26,000 వద్ద నిలిచి ఉంది. గతంలో ఈ స్థాయిలోనే కన్సాలిడేషన్ లేదా సైడ్‌వేస్ ట్రెండ్, ఆటుపోట్లు ఏర్పడ్డాయి. 26,000 వద్ద పరీక్ష ఎదుర్కొనడం వరుసగా ఇది ఐదోసారి. అమెరికన్ మార్కెట్ శుక్రవారం నాటి ధోరణిని పరిశీలించినట్టయితే మరోసారి అప్రమత్త ట్రెండ్ ఎదుర్కొనే ఆస్కారం ఉంది. మిడ్‌క్యాప్-100 సూచీ సైతం ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 61,000 చేరువలో ఉంది.
బుల్లిష్ స్థాయిలు: గత వారంలో ‘‘వి’’ ఆకారంలో రికవరీ సాధించినందు వల్ల 26,000 స్థాయిలో కన్సాలిడేట్ కావచ్చు. మరింత అప్‌ట్రెండ్ కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధ స్థాయి 26,300. ఏడాది క్రితం ఏర్పడిన గరిష్ఠ స్థాయి ఇదే.
బేరిష్ స్థాయిలు: ప్రస్తుత మద్దతు స్థాయి 25,750 వద్ద విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 25,450.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారంలో 640 పాయింట్ల లాభంతో ఆల్‌టైమ్ హై 58,500 వద్ద నిలకడగా క్లోజయింది. ట్రెండ్‌లో సానుకూలత కోసం ప్రధాన నిరోధం 59,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన మద్దతు స్థాయి 58,000. ఇక్కడ విఫలమైతే మరింత బలహీనపడుతుంది.
పాటర్న్: 26,000 వద్ద డబుల్ టాప్ పాటర్న్ ఏర్పడింది. అప్‌ట్రెండ్ కొనసాగించాలంటే దీన్ని ఛేదించాలి. 25,750 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది. గత వారంలో మార్కెట్ స్వల్పకాలిక డిఎంఏల కన్నా పైనే కదలాడుతూ ఉండడం నిలకడ ధోరణిని సూచిస్తోంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 26,000, 26,120
మద్దతు : 25,840, 25,780
వి. సుందర్ రాజా