టెక్ వ్యూ : మరింత కన్సాలిడేషన్‌కే ఆస్కారం
ABN , Publish Date - Feb 10 , 2025 | 05:54 AM
నిఫ్టీ గత వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలకు మధ్యన ముగియడం అనిశ్చిత ధోరణికి సంకేతం. మార్కెట్ మరింత కన్సాలిడేట్ కావలసి ఉంది. అయితే ఇప్పటికీ ప్రధాన మద్దతు స్థాయి 23,000 కన్నా చాలా పైన ఉండడం...

టెక్ వ్యూ : మరింత కన్సాలిడేషన్‌కే ఆస్కారం
నిఫ్టీ గత వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలకు మధ్యన ముగియడం అనిశ్చిత ధోరణికి సంకేతం. మార్కెట్ మరింత కన్సాలిడేట్ కావలసి ఉంది. అయితే ఇప్పటికీ ప్రధాన మద్దతు స్థాయి 23,000 కన్నా చాలా పైన ఉండడం వల్ల తక్షణ ముప్పు ఏదీ ఉండకపోవచ్చు. శుక్రవారం అమెరికన్ మార్కెట్లలో ఏర్పడిన రియాక్షన్ కారణంగా ఈ వారంలో నిఫ్టీ మరింత అప్రమత్త ట్రెండ్ ప్రదర్శించే ఆస్కారం ఉంది. మొత్తం మీద గత రెండు వారాల ర్యాలీ అనంతరం పుల్‌బ్యాక్ రియాక్షన్ ఏర్పడవచ్చు.
బుల్లిష్ స్థాయిలు: రియాక్షన్ ఏర్పడినా ట్రెండ్‌లో సానుకూలత కోసం రాబోయే కొద్ది రోజుల్లో 23,500 వద్ద బలంగా నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 23650, 23800. ఇక్కడ కూడా నిలదొక్కుకోగలిగితే తదుపరి టార్గెట్ 24,100.
బేరిష్ స్థాయిలు: ప్రస్తుత మద్దతు స్థాయి 23,300 వద్ద విఫలమైతే మైనర్ బలహీనతలో పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 23,000.
బ్యాంక్ నిఫ్టీ: ఈ వారంలో ఈ సూచీ మానసిక అవధి 50,000 వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు. ప్రధాన నిరోధం 50,600. ఇక్కడ నిలదొక్కుకుంటే తదుపరి టార్గెట్ 51,000. దిగువన ప్రధాన మద్దతు స్థాయిలు 49,400, 48,800.
పాటర్న్: మార్కెట్ సానుకూలత కోసం 50 డిఎంఏ వద్ద నిలదొక్కుకోవాలి. ప్రస్తుతం నిఫ్టీ 23,650 వద్ద ‘‘దిగువకు అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద ఉంది. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే స్వల్పకాలిక సానుకూలత ప్రదర్శిస్తుంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 23,650, 23,710
మద్దతు : 22,450, 22,380
వి. సుందర్ రాజా
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..