టీసీఎ్‌సలో కొత్త బెంచ్ రూల్స్
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:10 AM
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులకు కొత్త బెంచ్ రూల్స్ ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి ఇక ఏటా 35 రోజులకు మించి బెంచ్ మీద...
35 రోజులు మించితే ఉద్యోగానికే ఎసరు!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులకు కొత్త బెంచ్ రూల్స్ ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి ఇక ఏటా 35 రోజులకు మించి బెంచ్ మీద ఉండడాన్ని అనుమతించరు. ఈ నెల 12 నుంచే ఈ కొత్త నిబందనలు అమల్లోకి వచ్చాయి. ప్రాజెక్టులు (పని) లేక ఉద్యోగులు ఖాళీగా ఉండడాన్ని ఐటీ కంపెనీల్లో ‘బెంచ్’ అంటారు. ప్రతి ఉద్యోగి ఏటా కనీసం 225 రోజుల పాటు తప్పనిసరిగా ఏదో ఒక ప్రాజెక్ట్ పనిలో నిమగ్నమై ఉండాలని టీసీఎస్ స్పష్టం చేసింది. ఏ ఉద్యోగి అయినా ఏటా 35 రోజులకు మించి బెంచ్ మీద ఉంటే.. అది వారి జీతం, ప్రమోషన్లు, విదేశాలకు పంపే అవకాశాలు కోల్పోవడంతో పాటు ఉద్యోగానికి కూడా ముప్పు తెచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. బెంచ్ సమయంలో ఉద్యోగులే చొరవ తీసుకుని కంపెనీకి చెందిన వేరే ప్రాజెక్టుల్లో పని వెతుక్కోవాలని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి