టాటాకు ఐఫోన్ల మరమ్మతు బాధ్యతలు
ABN , Publish Date - Jun 06 , 2025 | 05:48 AM
అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్లో టాటా గ్రూప్‌తో తనకున్న భాగస్వామ్యాన్ని మరింత విస్తరించింది. దేశంలో ఐఫోన్లు, మ్యాక్ బుక్‌ల మరమ్మతుల బాధ్యతలను...
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్లో టాటా గ్రూప్‌తో తనకున్న భాగస్వామ్యాన్ని మరింత విస్తరించింది. దేశంలో ఐఫోన్లు, మ్యాక్ బుక్‌ల మరమ్మతుల బాధ్యతలను కూడా టాటాకు అప్పగించింది. టాటా గ్రూప్ ఇప్పటికే యాపిల్‌కు కీలక సరఫరాదారుల్లో ఒకటిగా ఉంది. దక్షిణాదిలోని మూడు ప్లాంట్లలో టాటా గ్రూప్.. యాపిల్ కోసం ఐఫోన్ల అసెంబ్లింగ్ చేస్తోంది. ఒక ప్లాంట్‌లో ఐఫోన్ల విడిభాగాలనూ తయారు చేస్తోంది. యాపిల్ ఉత్పత్తుల కాంట్రాక్ట్ తయారీదారుల్ల్లో ఒకటైన తైవాన్ కంపెనీ విస్ట్రాన్‌కు చెందిన భారత అనుబంధ విభాగం ఐసీటీ సర్వీస్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ నుంచి ఇక మరమ్మతు ఆర్డర్లనూ పొందనుంది. కర్ణాటకలోని ఐఫోన్ అసెంబ్లింగ్ క్యాంపస్ ద్వారా టాటా మరమ్మతు సేవలను అందించనుంది.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి