టాటా ఏఐఏ లైఫ్ శుభ్ ముహూరత్
ABN , Publish Date - Jan 26 , 2025 | 02:19 AM
తల్లిదండ్రులు పిల్లల పెళ్లి ఖర్చుల కోసం ఆదా చేసిందుకు వీలుగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘శుభ్ ముహూరత్’ పేరుతో సరికొత్త జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది...
తల్లిదండ్రులు పిల్లల పెళ్లి ఖర్చుల కోసం ఆదా చేసిందుకు వీలుగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘శుభ్ ముహూరత్’ పేరుతో సరికొత్త జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫంక్షన్ హాల్ బుకింగ్ నుంచి అతిథ్య సదుపాయాలు, సంగీత్ వంటి కార్యక్రమాల నిర్వహణ, ఆహా రం, పానీయాలు, పెళ్లి బట్టలు, ఆభరణాల కోసం చెల్లింపుల కోసం ఈ పాలసీ వీలు కల్పిస్తుంది. అంతేకాదు, క్యాపిటల్ గ్యారంటీ, మార్కెట్ అనుసంధానిత పెట్టుబడుల వృద్ధి, దురదృష్టవశాత్తు పేరెంట్ చనిపోయిన పక్షం లో జీవిత బీమా కవరేజీ వంటి ఫీచర్లను సైతం కలిగి ఉంది. ఏడాది నుంచి 20 ఏళ్ల వయసున్న పిల్లలు కలిగిన 31-51 ఏళ్ల తల్లిదండ్రుల కోసమే ఈ పథకం.