Share News

TAFE Electric Hybrid Tractor: టఫే కొత్త ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ ట్రాక్టర్‌

ABN , Publish Date - Nov 12 , 2025 | 04:50 AM

భారత వ్యయసాయయంత్రాల తయారీ దిగ్గజం ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్వి్‌పమెంట్‌ లిమిటెడ్‌ (టఫే) కొత్త తరం ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ ట్రాక్టర్‌ ‘ఈవీఎక్స్‌ 75’ను విడుదల చేసింది. జర్మనీలో జరుగుతున్న...

TAFE Electric Hybrid Tractor: టఫే కొత్త ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ ట్రాక్టర్‌

న్యూఢిల్లీ: భారత వ్యయసాయయంత్రాల తయారీ దిగ్గజం ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్వి్‌పమెంట్‌ లిమిటెడ్‌ (టఫే) కొత్త తరం ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ ట్రాక్టర్‌ ‘ఈవీఎక్స్‌ 75’ను విడుదల చేసింది. జర్మనీలో జరుగుతున్న అగ్రిటెక్నికా-2025 ప్రదర్శనలో ఈ కొత్త మోడల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. 75 హెచ్‌పీ హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌, ఈయూ స్టేజ్‌-5 డీజిల్‌ ఇంజన్‌, 400 వోల్ట్‌ ఎలక్ట్రిక్‌ బ్యాటరీ సిస్టమ్‌తో రూపొందించినట్లు టఫే తెలిపింది. లిక్విడ్‌ కూల్డ్‌ హై-వోల్టేజ్‌ సిస్టమ్‌, 3-స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ (గరిష్ట వేగం గంటకి 40 కి.మీ), పుల్‌ హెచ్‌వీఏసీ క్యాబిన్‌, ఎలకో్ట్ర-హైడ్రాలిక్‌ రియర్‌ లిప్ట్‌, ఇండిపెండెంట్‌ పీటీవో వంటి ఫీచర్లతో ఈ కొత్త ట్రాకర్ట్‌ వస్తున్నట్టు కంపెనీ వైస్‌ ఛైర్మన్‌ డా. లక్ష్మీ వేణు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్

ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం

Updated Date - Nov 12 , 2025 | 04:50 AM