Supreme Court Says: రుణగ్రహీత వాదన విన్నాకే మోసపూరిత ఖాతాల ప్రకటన
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:01 AM
మోసపూరిత బ్యాంకు ఖాతాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటించే ముందు.. ఆ ఖాతాదారుడి వాదన వినడంలో బ్యాంకులకు వచ్చిన ఇబ్బంది...
న్యూఢిల్లీ: మోసపూరిత బ్యాంకు ఖాతాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటించే ముందు.. ఆ ఖాతాదారుడి వాదన వినడంలో బ్యాంకులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని సూటిగా ప్రశ్నించింది. ఎస్‌బీఐ.. ఒక సంస్థ రుణ ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటించడాన్ని ఆక్షేపిస్తూ ఆ సంస్థ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. కోల్‌కతా హైకోర్టు ఈ కేసులో రుణగ్రహీత వాదన విన్న తర్వాతే ఆ ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటించాలని స్పష్టం చేసింది. ఎస్‌బీఐ దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ అప్పీల్‌ను విన్న జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఒక ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటించే ముందు రుణగ్రహీత వాదన వినడంలో బ్యాంకులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. తదుపరి ఈ కేసు విచారణను సర్వోన్నత న్యాయస్థానం ఈనెల 18కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి:
ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్ కార్డు డీయాక్టివేట్!
మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి