స్టైలిష్ యాక్టివ్‌వేర్ టెక్నోస్పోర్ట్..
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:04 AM
స్టైలిష్ యాక్టివ్‌వేర్ టెక్నోస్పోర్ట్.. దక్షిణ భారతదేశంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ టోలిచౌకిలో ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను...

స్టైలిష్ యాక్టివ్‌వేర్ టెక్నోస్పోర్ట్.. దక్షిణ భారతదేశంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ టోలిచౌకిలో ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను ప్రారంభించింది. దక్షిణాదిలో కంపెనీకి ఇది ఏడో స్టోర్. ఈ స్టోర్లలో తేలికపాటి జాకెట్స్, స్వెట్‌షర్ట్స్ సహా ఫిట్‌నెస్ చేసే వారి కోసం అత్యుత్తమమైన యాక్టివ్‌వేర్ అందుబాటులో ఉండనున్నాయి.
డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్... డిపాజిట్లలో రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. ఈ కాలంలో బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 16 శాతం వృద్ధితో రూ.29,669 కోట్ల నుంచి రూ.34,496 కోట్లకు చేరుకున్నాయి. మైక్రోఫైనాన్స్, రిటైల్ రుణ విభాగాల రుణ బుక్ కూడా 10 శాతం పెరుగుదలతో రూ.30,466 కోట్లకు వృద్ధి చెందాయి.