Share News

Stock Market Surges: రిలీఫ్‌ ర్యాలీతో మార్కెట్‌ దూకుడు

ABN , Publish Date - Nov 20 , 2025 | 06:00 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం బాగా పుంజుకుంది. సెన్సెక్స్‌ 513.45 పాయింట్ల లాభంతో 85,186.47 వద్ద ముగియగా నిఫ్టీ 142.60 పాయింట్ల లాభంతో 26,052.65 వద్ద క్లోజయింది. ఇంట్రా డేలో...

Stock Market Surges: రిలీఫ్‌ ర్యాలీతో మార్కెట్‌ దూకుడు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం బాగా పుంజుకుంది. సెన్సెక్స్‌ 513.45 పాయింట్ల లాభంతో 85,186.47 వద్ద ముగియగా నిఫ్టీ 142.60 పాయింట్ల లాభంతో 26,052.65 వద్ద క్లోజయింది. ఇంట్రా డేలో సెన్సెక్స్‌ 85,236.77 పాయింట్లు, నిఫ్టీ 26,074.65 పాయిం ట్ల గరిష్ఠ స్థాయిని తాకాయి. ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు, త్వరలోనే భారత-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న అంచనా లు బుధవారం సూచీలను లాభాల బాట పట్టించాయి. జపాన్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నా, భారత మార్కెట్లు మాత్రం లాభాలతో ముగియడం విశేషం. అమెరికాలో ఏఐ బుడగ పేలితే ఎఫ్‌పీఐలు మళ్లీ పెద్ద ఎత్తున భారత మార్కెట్‌లో కొనుగోళ్లకు దిగుతాయన్న అంచనాలూ ఇందుకు దోహదం చేశాయి. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు మినిట్స్‌ కోసం మార్కెట్‌ ఆసక్తితో ఎదురు చూస్తోంది.

నేటి నుంచి ఇన్ఫోసిస్‌ బైబ్యాక్‌: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ బైబ్యాక్‌ గురువారం ప్రారంభం కానుంది. కంపెనీ మదుపరుల నుంచి రూ.18,000 కోట్లతో 10 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.1,800 చొప్పున బైబ్యాక్‌ చేయనుంది. దీంతో బీఎ్‌సఈలో బుధవారం ఇన్ఫోసిస్‌ కంపెనీ షేర్లు 3.74 శాతం లాభంతో రూ.1,541.25 వద్ద ముగిశాయి. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.23,098.48 కోట్లు పెరిగి రూ.6,40,297.11 కోట్లకు చేరింది.

ఇవి కూడా చదవండి..

ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..

టీవీకే సభ్యులకు క్యూ ఆర్‌ కోడ్‌తో గుర్తింపు కార్డులు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 20 , 2025 | 06:00 AM