అప్రమత్తతే బెటర్
ABN , Publish Date - Apr 28 , 2025 | 02:18 AM
భారత-పాక్ ఉద్రిక్తతల ప్రభావం స్టాక్ మార్కెట్ పైనా కనిపిస్తోంది. ఈ కారణంగా ఈ వారం సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మదుపరులు పరిస్థితులు కుదుటపడే...
భారత-పాక్ ఉద్రిక్తతల ప్రభావం స్టాక్ మార్కెట్ పైనా కనిపిస్తోంది. ఈ కారణంగా ఈ వారం సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మదుపరులు పరిస్థితులు కుదుటపడే వరకు అప్రమత్తతతో ఉండడమే మంచిది. గత వారం 350 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ ఇంట్రా డే కనిష్ఠ స్థాయి నుంచి 150 పాయింట్లు కోలుకుంది. ఇది బై ఆన్ డిప్స్‌ను సూచిస్తోంది. ప్రస్తుతం వైమానిక, చమురు, బ్యాంకింగ్, టెలికం, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్, మద్యం కంపెనీల షేర్లు బుల్లి్‌షగా కనిపిస్తున్నాయి.
ఈ వారం స్టాక్ రికమండేషన్లు
ఎస్‌బీఐ లైఫ్: ఈ ఏడాది ఆరంభం నుంచి అక్యూములేషన్ జోన్‌లో ఉన్న ఎస్‌బీఐ లైఫ్ షేర్లు ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్నాయి. మూమెంటమ్, రిలెటివ్ స్ట్రెంత్ కూడా క్రమంగా పెరుగుతోంది. తాజా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఫర్వాలేదనిపించాయి. గత వారం 5.4 శాతం లాభంతో ఈ షేరు రూ.1.695 వద్ద ముగిసింది. రూ.1,820 టార్గెట్‌తో మ దుపరులు రూ.1,650 వద్ద ఈ కౌంట ర్లో పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్ : రూ.1,610
గ్రాసిమ్ ఇండస్ట్రీస్: రూ.2,300 వద్ద డబుల్ బాటమ్ ఏర్పరచుకున్న ఈ కంపెనీ షేర్లు ప్రస్తుతం కీలక రెసిస్టెన్స్ రూ.2,700 పైన ట్రేడవుతున్నాయి. రూ.2,950 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్లో రూ.2,700 పై స్థాయిలో టకొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ : రూ.2,670
ఎంఫసిస్: గత ఏడాది డిసెంబరు నుంచి 16 శాతం దిద్దుబాటుకు లోనైన ఎంఫసిస్ కంపెనీ షేర్లు ప్రస్తుతం అక్యూములేషన్ జోన్‌లో ఉన్నాయి. షార్ట్‌టర్మ్ మూమెంటమ్, ట్రేడింగ్ వాల్యూమ్స్ క్రమంగా పెరుగుతున్నాయి. రెండు సార్లు రూ.2,200 వద్ద మద్దతు తీసుకుని బలం ప్రదర్శిస్తున్నాయి. గత వారం రూ.2,538 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.2,655 టార్గెట్‌తో రూ.2,520 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు.
స్టాప్‌లాస్ : రూ.2,490
హెచ్‌యూఎల్: ఈ మల్టీనేషనల్ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ షేర్లు ప్రస్తుతం అక్యూములేషన్ జోన్‌లో కొనసాగుతున్నాయి. 2025 మార్చి ఆర్థిక ఫలితాలతో ఈ కౌంటర్‌పై మదుపరుల ఆసక్తి మరింత పెరిగింది. షార్ట్ టర్మ్ మూమెంటం పెరుగుతోంది. గత వారం ఈ కంపెనీ షేర్లు రూ.2,332 వద్ద ముగిశాయి. రూ.2550 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్లో రూ.2,300 వద్ద ప్రవేశించవచ్చు.
స్టాప్‌లాస్ : రూ.2,260
పవర్‌గ్రిడ్: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ కౌంటర్లో మార్చి నుంచి మూమెంటం కనిపిస్తోంది. 10-20 రోజుల మూవింగ్ యావరేజి వద్ద మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం ప్రైస్ యాక్షన్ టైట్‌గా ఉంది. వాల్యూ మ్స్ కాంట్రాక్షన్ కూడా జరుగుతోంది. గత వారం రూ.306 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.380 టార్గెట్‌తో రూ.290-300 మధ్య పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్ : రూ.270
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
Read Also: Gold Rates Today: నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఇవీ
జీవిత బీమా పాలసీదారులకు రైడర్లతో మరింత రక్షణ
జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు ఏం కావాలంటే ?