Share News

Stock Market: ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Jul 10 , 2025 | 10:26 AM

కాఫర్ దిగుమతులపై 50 శాతం సుంకం విధించడం, ఫార్మా ఉత్పత్తులపై కూడా భారీ పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఆయా రంగాలు నష్టాల బాట పట్టాయి. మిగిలిన రంగాలు స్వల్ప నష్టాలతో కదలాడుతున్నాయి

Stock Market: ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
Stock Market

అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో దేశీయ సూచీలు ఈ రోజు కూడా ఫ్లాట్‌గానే ట్రేడ్ అవుతున్నాయి. కాఫర్ దిగుమతులపై 50 శాతం సుంకం విధించడం, ఫార్మా ఉత్పత్తులపై కూడా భారీ పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా రంగాలు నష్టాల బాట పట్టాయి. మిగిలిన రంగాలు స్వల్ప నష్టాలతో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. (Business News).


బుధవారం ముగింపు (83, 536)తో పోల్చుకుంటే గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాసేపు లాభాల్లో కదలాడింది. 83,742 వద్ద గరిష్టానికి చేరింది. ఆ వెంటనే నష్టాల్లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఉదయం 10:20 గంటల సమయంలో సెన్సెక్స్ 179 పాయింట్ల పాయింట్ల నష్టంతో 83, 356 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 64 పాయింట్ల నష్టంతో 25, 411 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో ప్రేస్టేజ్ ఎస్టేట్, గ్లెన్‌మార్క్, పేటీఎమ్, పవర్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పీఐ ఇండస్ట్రీస్, భారత్ డైనమిక్స్, ఐసీఐసీఐ లాంబార్డ్, ఇన్ఫో‌ఎడ్జ్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 12 పాయింట్ల స్వల్ప లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.62గా ఉంది.


ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 10 , 2025 | 10:26 AM