Stock Market: స్టాక్‌మార్కెట్లకు లాభాలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Jul 15 , 2025 | 10:46 AM
కనిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. త్రైమాసిక ఫలితాల సీజన్ కావడం కూడా మార్కెట్లకు కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి.
గత కొన్ని రోజులుగా నిరాశాజనకంగా కదలాడుతున్న దేశీయ సూచీలు ఎట్టకేలకు లాభాల బాట పట్టాయి. కనిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. త్రైమాసిక ఫలితాల సీజన్ కావడం కూడా మార్కెట్లకు కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఐటీ, ఫార్మా రంగాలు నష్టాల్లో కొనసాగుతుండగా, బ్యాంకింగ్ రంగం లాభాలను ఆర్జిస్తోంది (Business News).
సోమవారం ముగింపు (82, 253)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల బాట పట్టింది. ఒక దశలో దాదాపు 250 పాయింట్లు లాభపడి 82, 495 వద్ద గరిష్టానికి చేరింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 208 పాయింట్ల లాభంతో 82, 462 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 77 పాయింట్ల లాభంతో 25, 159 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో పిరామిల్ ఎంటర్‌ప్రైజెస్, బంధన్ బ్యాంక్, హీరోమోటోకార్ప్, పీజీ ఎలక్ట్రోఫాస్ట్, ఫోర్టిస్ హెల్త్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, ఐనాక్స్ విండ్, మ్యాన్‌కైండ్ ఫార్మా, గ్లెన్‌మార్క్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 236 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 295 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.93గా ఉంది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..