Stock Market: అమెరికా వార్నింగ్.. నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు..
ABN , Publish Date - Jul 16 , 2025 | 10:25 AM
రష్యాతో వ్యాపారం చేస్తే వంద శాతం సుంకాలు విధిస్తామని భారత్, చైనాలకు నాటో దేశాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు త్రైమాసిక ఫలితాల సీజన్ కావడం కూడా మార్కెట్ల ఒడిదుడుకులకు కారణమవుతోంది.
మంగళవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. రష్యాతో వ్యాపారం చేస్తే వంద శాతం సుంకాలు విధిస్తామని భారత్, చైనాలకు నాటో దేశాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు త్రైమాసిక ఫలితాల సీజన్ కావడం కూడా మార్కెట్ల ఒడిదుడుకులకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి (Business News).
మంగళవారం ముగింపు (82, 570)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల బాట పట్టింది. ఒక దశలో దాదాపు 200 పాయింట్లు కోల్పయి 82, 371 వద్ద కనిష్టానికి చేరింది. ప్రస్తుతం ఉదయం 10:20 గంటల సమయంలో సెన్సెక్స్ 149 పాయింట్ల నష్టంతో 82, 420 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 52 పాయింట్ల నష్టంతో 25, 143 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో డిక్సన్ టెక్నాలజీస్, ఆర్బీఎల్ బ్యాంక్, పతంజలి ఫుడ్స్, పేటీఎమ్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అంబర్ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏబీబీ ఇండియా, జిందాల్ స్టీల్స్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 50 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.89గా ఉంది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..