Stock Market: స్టాక్ మార్కెట్లకు మళ్లీ లాభాలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే
ABN , Publish Date - May 14 , 2025 | 03:48 PM
సోమవారం, మంగళవారాల్లో భారీ లాభ, నష్టాలు చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం ఓ మోస్తారు లాభాలను ఆర్జించాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మంగళవారం నష్టాలను చవిచూసిన సూచీలు బుధవారం స్థిరంగా రాణించాయి. బుధవారం సెన్సెక్స్ 182 పాయింట్లు లాభపడింది.

సోమవారం, మంగళవారాల్లో భారీ లాభ, నష్టాలు చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం ఓ మోస్తారు లాభాలను ఆర్జించాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మంగళవారం నష్టాలను చవిచూసిన సూచీలు బుధవారం స్థిరంగా రాణించాయి. బుధవారం సెన్సెక్స్ 182 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ కూడా అదే బాటలో నడిచి 88 పాయింట్లు పైకి ఎగబాకింది (Business News).
మంగళవారం ముగింపు (81, 148)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం 130 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఉదయం అంతా లాభాల్లోనే కొనసాగింది. అయితే మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకుని చివర్లో మళ్లీ కోలుకుంది. సెన్సెక్స్ బుధవారం 80,910-81,691 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు 182 పాయింట్ల లాభంతో 81,330 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 88 పాయింట్ల లాభంతో 24, 666 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో టిటాగర్, ఏబీ క్యాపిటల్, సెయిల్, ఎన్‌బీసీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆర్‌ఈసీ, పతంజలి ఫుడ్స్, ఆసియన్ పెయింట్స్, సిప్లా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 615 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్లు కోల్పోయింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..