Stock Market: స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు.. 1200 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ABN , Publish Date - May 15 , 2025 | 04:06 PM
ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు ఆ తర్వాత భారీ లాభాల్లోకి దూసుకొచ్చాయి. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ కుదిరే వీలుందని వార్తలు రావడం మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. అలాగే మెటల్, ఆటో, రియాల్టీ, ఐటీ రంగాల్లో భారీ కొనుగోళ్లు మార్కెట్‌కు బూస్టింగ్ ఇచ్చాయి.
ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు ఆ తర్వాత భారీ లాభాల్లోకి దూసుకొచ్చాయి. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ కుదిరే వీలుందని వార్తలు రావడం మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. అలాగే మెటల్, ఆటో, రియాల్టీ, ఐటీ రంగాల్లో భారీ కొనుగోళ్లు మార్కెట్‌కు బూస్టింగ్ ఇచ్చాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ గురువారం భారీ లాభాలను ఆర్జించాయి. గురువారం సెన్సెక్స్ 1200 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ కూడా అదే బాటలో నడిచి 395 పాయింట్లు పైకి ఎగబాకింది (Business News).
బుధవారం ముగింపు (81, 330)తో పోల్చుకుంటే దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఉదయం అంతా లాభ, నష్టాలతో దోబూచులాడింది. అయితే మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి దూసుకొచ్చింది. మెటల్, ఆటో, రియాల్టీ, ఐటీ రంగాల్లో కొనుగోళ్లు సెన్సెక్స్‌ను ముందుకు నడిపించాయి. ఇంట్రాడే కనిష్టంతో పోల్చుకుంటే ఏకంగా 2000 పాయింట్లు పైకి ఎగబాకింది. చివరకు 1200 పాయింట్ల లాభంతో 82, 530 వద్ద రోజును ముగించింది. చాలా రోజుల తర్వాత 82 వేలకు పైన ముగిసింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 395 పాయింట్ల లాభంతో 25, 062 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో హీరో మోటోకార్ప్, హెచ్‌ఎఫ్‌సీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ముత్తూట్ ఫైనాన్స్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్, సీఈఎస్‌సీ, బీఎస్‌ఈ లిమిటెడ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 394 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 554 పాయింట్లు ఎగబాకింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..