Share News

Stock Market: స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు.. 800 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ABN , Publish Date - May 20 , 2025 | 04:16 PM

విదేశీ మదుపర్లు అమ్మకాలకు దిగడం, అమెరికా-భారత్ ట్రేడ్ డీల్‌లో అనిశ్చితి, ఆటో సెక్టార్‌లో అమ్మకాలు దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావం చూపించాయి. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అలాగే గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు.

Stock Market: స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు.. 800 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
Stock Market

విదేశీ మదుపర్లు అమ్మకాలకు దిగడం, అమెరికా-భారత్ ట్రేడ్ డీల్‌లో అనిశ్చితి, ఆటో సెక్టార్‌లో అమ్మకాలు దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావం చూపించాయి. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అలాగే గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజు కూడా నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మళ్లీ 24, 700 వేల దిగువకు వచ్చింది. (Business News).


సోమవారం ముగింపు (82, 059)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలు మరింత పెరిగాయి. ఉదయం 82, 250 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరిన సెన్సెక్స్ అక్కడితో పోల్చుకుంటే ఏకంగా 1000 పాయింట్లకు పైగా కోల్పోయి 81,153 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 872 పాయింట్ల నష్టంతో 81,186 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 261 పాయింట్ల నష్టంతో 24, 683 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో డీఎల్‌ఎఫ్, కోల్ ఇండియా, నైకా, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. టిటాగర్, ఎన్‌బీసీసీ, హెచ్‌ఎఫ్‌సీఎల్, ఎటర్నల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 922 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 543 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.64గా ఉంది.

మరిన్ని బిజిెనెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2025 | 04:16 PM