Stock Market: నష్టాలతో మొదలైన మార్కెట్లు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Mar 11 , 2025 | 09:26 AM
వరుస లాభాలతో దూసుకుపోతున్న దేశీయ సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సోమవారం మార్కెట్లు నష్టపోయాయి. మంగళవారం ఉదయం కూడా మార్కెట్లు అదే ధోరణితో ప్రారంభమయ్యాయి.

వరుస లాభాలతో దూసుకుపోతున్న దేశీయ సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సోమవారం మార్కెట్లు నష్టపోయాయి. మంగళవారం ఉదయం కూడా మార్కెట్లు అదే ధోరణితో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కూడా మార్కెట్ల పతనానికి కారణమవుతున్నాయి. హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుతుండడం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల బాటలో సాగుతున్నాయి (Business News).
సోమవారం ముగింపు (74, 157)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం సెన్సెక్స్ 371 పాయింట్ల నష్టంతో మొదలైంది. గత వారం ప్రారంభంలో వరుస నష్టాలతో 72 వేల స్థాయికి చేరుకున్న సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. అయితే ఆ ర్యాలీ ఎక్కువ రోజులు సాగలేదు. మళ్లీ నష్టాల బాట పట్టింది. ప్రస్తుతం ఉదయం 9: 30 గంటల సమయంలో సెన్సెక్స్ 412 పాయింట్ల నష్టంతో 73, 706 వద్ద కొనసాగుతోంది. మరో వైపు హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాల కారణంగా నిఫ్టీ నష్టాలతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం ఉదయం 9:30 గంటల సమయంలో 131 పాయింట్ల నష్టంతో 22, 329 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో టాటా కమ్యూనికేషన్స్, మ్యాక్స్ ఫైనాన్సియల్స్, లారస్ ల్యాబ్స్, పేటీఎమ్ షేర్లు లాభాల బాటలో సాగుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, జొమాటో, సోనా బీఎల్‌డబ్ల్యూ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం మిడ్ క్యాప్ ఇండెక్స్ 583 పాయింట్ల భారీ నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 424 పాయింట్ల నష్టంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.32గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..