ఐపీఓలపై స్టార్ట్‌పల దృష్టి
ABN , Publish Date - Feb 12 , 2025 | 03:14 AM
నిధుల సమీకరణ లేదా పెట్టుబడుల ఉపసంహరణ కోసం అనేక స్టార్టప్ కంపెనీలు ఈ సంవత్సరం ఐపీఓ మార్కెట్‌వైపు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా కొన్ని సవాళ్లున్నా ఈ సంవత్సరం...

పెరగనున్న నియామకాలు.. జూ ఇన్నోవెన్ క్యాపిటల్
న్యూఢిల్లీ: నిధుల సమీకరణ లేదా పెట్టుబడుల ఉపసంహరణ కోసం అనేక స్టార్టప్ కంపెనీలు ఈ సంవత్సరం ఐపీఓ మార్కెట్‌వైపు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా కొన్ని సవాళ్లున్నా ఈ సంవత్సరం ఈ కంపెనీల నిధుల సమీకరణకు పెద్ద ఇబ్బందులేమీ ఉండక పోవచ్చని ఇన్నోవెన్ క్యాపిటల్ అనే సంస్థ తన తాజా ‘ఇండియా స్టార్టప్ ఔట్‌లుక్ నివేదికలో తెలిపింది. ఈ సర్వేలో పాల్గొన్న 100 స్టార్టప్ కంపెనీల ప్రమోటర్లలో 47 మంది ఈ సంవత్సరం నియామకాల జోరు పెరుగుతుందని చెప్పారు. అయితే నిధుల సమీకరణలో సమసట్యలు ఉండవన్న 79 శాతం మంది చెప్పగా ఐపీఓల ద్వారా పెట్టుబడుల ఉపసంహరణకు 73 శాతం స్టార్టప్ కంపెనీల ప్రమోటర్ల ఆసక్తి ప్రదర్శించారు. వచ్చే రెండు మూడేళ్లలో తమ వ్యాపార మోడల్స్‌పై ఏఐ ప్రభావం ఉంటుందని 28 శాతం స్టార్టప్ కంపెనీల ప్రమోటర్లన్నారు. 83 శాతానికిపైగా స్టార్టప్ కంపెనీల నాయకత్వ స్థానాల్లో మహిళలు 20 శాతం కూడా లేరని ఆ సర్వేలో తేలింది.