క్విక్ కామర్స్‌లోకి స్పెన్సర్స్
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:35 AM
ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌నకు చెందిన స్పెన్సర్స్ రిటైల్ సైతం క్విక్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది...
కోల్‌కతా: ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌నకు చెందిన స్పెన్సర్స్ రిటైల్ సైతం క్విక్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. వ్యాపార వృద్ధితో పాటు మళ్లీ లాభాల బాట పట్టేందుకు జిఫ్ఫీ పేరుతో క్విక్ కామర్స్ సేవలను తొలుత పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించినట్లు స్పెన్సర్స్ తెలిపింది. కస్టమర్లకు స్పెన్సర్స్ స్టోర్ల నుంచి 20-30 నిమిషాల్లో సరుకులను డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది.