Share News

దక్షిణాదిలో అతిపెద్ద మహీంద్రా షోరూమ్‌

ABN , Publish Date - May 07 , 2025 | 05:27 AM

ఆటోమొబైల్‌ రిటైల్‌ సంస్థ ఆటోమోటివ్‌ మానుఫ్యాక్చరర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఎంపీఎల్‌) దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద మహీంద్రా డీలర్‌షిప్‌ షోరూమ్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని...

దక్షిణాదిలో అతిపెద్ద మహీంద్రా షోరూమ్‌

విజయవాడలో ఏర్పాటు

విజయవాడ (ఆంధ్రజ్యోతి): ఆటోమొబైల్‌ రిటైల్‌ సంస్థ ఆటోమోటివ్‌ మానుఫ్యాక్చరర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఎంపీఎల్‌) దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద మహీంద్రా డీలర్‌షిప్‌ షోరూమ్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఏర్పాటు చేసింది. విజయవాడలోని ఎనికేపాడులో రూ.15 కోట్లతో 1.03 లక్షల చదరపు అడుగుల్లో ఈ షోరూమ్‌ను నెలకొల్పినట్లు ఏఎంపీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ సంఘ్వీ తెలిపారు. అత్యాధునిక 3ఎస్‌ (సేల్స్‌, సర్వీస్‌, స్పేర్స్‌) సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు.

Read More Business News and Latest Telugu News

Updated Date - May 07 , 2025 | 05:27 AM