హైదరాబాద్‌లో స్మార్ట్‌వర్క్స్ విస్తరణ
ABN , Publish Date - Mar 19 , 2025 | 05:29 AM
కోవర్కింగ్ స్పేస్ విభాగంలో పెరిగిన డిమాండ్‌ను తట్టుకునేందుకు స్మార్ట్‌వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్ కంపెనీ హైదరాబాద్‌లో..
మరో 2.2 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కోవర్కింగ్ స్పేస్ విభాగంలో పెరిగిన డిమాండ్‌ను తట్టుకునేందుకు స్మార్ట్‌వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్ కంపెనీ హైదరాబాద్‌లో మరో 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలాన్ని లీజుకి తీసుకుంది. గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ సైబర్ సిటీలో ఈ స్థలం తీసుకున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లో ఇది తమకు నాలు గో సెంటర్ అని, దీంతో తమ అధీనంలోని స్థలం పరిమాణం 10 లక్షల చదరపు అడుగులకు పెరిగిందని పేర్కొంది.
Read More Business News and Latest Telugu News