Stock Market Decline: ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:44 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో ఆరు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లలో..
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో ఆరు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు ఇందుకు కారణం. సెన్సెక్స్ 693.86 పాయింట్లు నష్టపోయి 81,306.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 213.65 పాయింట్లు కోల్పోయి 24,870.10 వద్ద స్థిరపడింది. బీఎ్‌సఈలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.2.62 లక్షల కోట్లు తగ్గి రూ.453.65 లక్షల కోట్లకు పడిపోయింది.
ఆన్‌లైన్ గేమింగ్ రంగంలోని కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. నజారా టెక్నాలజీస్ షేరు మరో 4.13% పతనమైంది. గడిచిన మూడు సెషన్లలో ఈ స్టాక్ 17.52% క్షీణించింది. డెల్టా కార్ప్ షేరు మరో 3.50%, ఆన్‌మొబైల్ గ్లోబల్ 2.73% తగ్గాయి.
ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 27 పైసల నష్టంతో రూ.87.52 వద్ద ముగిసింది.
ఈనెల 15తో ముగిసిన వారంలో విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వలు 148.8 కోట్ల డాలర్ల వృద్ధితో మొత్తం 69,510.6 కోట్ల డాలర్లకు పెరిగాయని ఆర్‌బీఐ వెల్లడించింది.
స్నేహ ఆర్గానిక్స్ రూ.32.68 కోట్ల ఎస్‌ఎంఈ ఐపీఓ ఈనెల 29న ప్రారంభమై వచ్చేనెల 2న ముగియనుంది. ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.115-122గా ఉంది.