గెట్టీ ఇమేజె్‌సలో షట్టర్‌స్టాక్ విలీనం
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:04 AM
విజువల్ కంటెంట్ రంగంలో భారీ డీల్ కుదిరింది. షట్టర్‌స్టాక్‌ను గెట్టీ ఇమేజెస్ కొనుగోలు చేయనుంది. ఈ రెండింటి విలీనం ద్వారా 370 కోట్ల డాలర్ల విలువైన విజువల్ కంటెంట్ కంపెనీ ఏర్పడనుంది...
న్యూయార్క్: విజువల్ కంటెంట్ రంగంలో భారీ డీల్ కుదిరింది. షట్టర్‌స్టాక్‌ను గెట్టీ ఇమేజెస్ కొనుగోలు చేయనుంది. ఈ రెండింటి విలీనం ద్వారా 370 కోట్ల డాలర్ల విలువైన విజువల్ కంటెంట్ కంపెనీ ఏర్పడనుంది. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత సృష్టిస్తున్న చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలోనే ఈ రెండు కంపెనీ ఒక్కటికాబోతున్నాయి. విలీనం తర్వాత ఏర్పడనున్న కంపెనీలో గెట్టీ ఇమేజెస్ షేర్‌హోల్డర్లు 54.7 శాతం, షట్టర్‌స్టాక్ షేర్‌హోల్డర్లు 45.3 శాతం వాటా కలిగి ఉండనున్నారు. విలీన తర్వాత ఏర్పడే కంపెనీ గెట్టీ ఇమేజెస్ పేరుతో కొనసాగనుంది. అలాగే, కంపెనీ షేరు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అదే పేరుతో ట్రేడవనుంది.