ఎంఎస్ఎంఈలపై మరింత ఫోకస్
ABN , Publish Date - Jun 10 , 2025 | 04:35 AM
త్వరలో పబ్లిక్ ఇష్యూకి వస్తోన్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ షిప్‌రాకెట్.. ఎంఎ్‌సఎంఈలకు తన సేవలను మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్ ద్వారా అంతర్జాతీయంగా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): త్వరలో పబ్లిక్ ఇష్యూకి వస్తోన్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ షిప్‌రాకెట్.. ఎంఎ్‌సఎంఈలకు తన సేవలను మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్ ద్వారా అంతర్జాతీయంగా, దేశీయంగా తమ వ్యాపారాలను విస్తరించాలనుకునే ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకమైన సేవలందించనున్నట్లు సంస్థ సీఈఓ (డొమెస్టిక్ షిప్పింగ్) సీఈఓ అతుల్ మెహతా చెప్పారు. షిప్‌రాకెట్ పోర్టల్‌పై ఇప్పటికే 3 లక్షల మంది విక్రేతలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల నుంచి దాదాపు 18 వేల మంది విక్రేతలు షిప్‌రాకెట్ ద్వారా 2 కోట్లకు పైగా ఉత్పత్తులను విక్రయించారని తెలిపారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంఎ్‌సఎంఈలు చేసిన షిప్‌మెంట్స్ 35 లక్షలకు పైగా ఉన్నాయన్నారు.
కాగా కంపెనీ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 32 వేర్‌హౌసె్‌సను నిర్వహిస్తోందని మెహతా చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఢిల్లీలో డార్క్ స్టోర్స్ పేరుతో క్విక్ కామర్స్ సేవలను ప్రారంభించామని, దశల వారీగా దీన్ని ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో డ్రోన్ ద్వారా ఉత్పత్తుల డెలివరీని చేపట్టాలని చూస్తున్నట్లు మెహతా తెలిపారు.
ఇవీ చదవండి:
రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు
ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..