యుద్ధ భయాలు బేఖాతరు
ABN , Publish Date - Jun 17 , 2025 | 01:25 AM
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ భయాలను పక్కన పెట్టి మదుపరులు కొనుగోళ్లపై దృష్టి సారించడంతో స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం మంచి లాభాలను...
678 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
రూ.3.31 లక్షల కోట్ల సంపద వృద్ధి
ముంబై: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ భయాలను పక్కన పెట్టి మదుపరులు కొనుగోళ్లపై దృష్టి సారించడంతో స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం మంచి లాభాలను నమోదు చేశాయి. ఒక దశలో 747 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. చివరికి 677.55 పాయింట్ల లాభంతో 81,796.15 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 227.90 పాయింట్ల వృద్ధితో 24,946.50 వద్ద ముగిసింది. గత వారాంతంలో భారీగా పెరిగిన ముడి చమురు ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ రంగ షేర్లలో వాలూ బైయింగ్‌కు పాల్పడటం ర్యాలీకి దోహదపడింది. కాగా ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.31 లక్షల కోట్ల పెరుగుదలతో రూ.450.52 లక్షల కోట్లకు (5.24 లక్షల కోట్ల డాలర్లు) చేరింది.
నెలాఖరుకు హెచ్‌డీబీ ఫైనాన్షియల్ ఐపీఓ: హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.12,500 కోట్ల ఐపీఓ ఈ నెలాఖరులో (25-27తేదీల్లో) మార్కెట్లోకి రానున్నట్లు సమా చారం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో ఇప్పటివరకిదే అతిపెద్ద ఐపీఓ కానుంది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.62,000 కోట్ల మార్కెట్ విలువను ఆశిస్తోంది.
వృద్ధుల సంరక్షణలో హైదరాబాద్ సంస్థకు అవార్డు
హైదరాబాద్‌కు చెందిన సామాజిక సంస్థ లైఫ్ సర్కిల్ హెల్త్ సర్వీసెస్ DBS ఫౌండేషన్ ఇంపాక్ట్ బియాండ్ అవార్డ్ 2024ను గెలుచుకుంది. వృద్ధుల సంరక్షణ, అవసరాలను తీర్చే వ్యాపారాలకు మద్దతుగా ఈ అవార్డుల ప్రదానాన్ని గతేడాది ప్రారంభించారు. ఈ పురస్కారం కింద లైఫ్ సర్కిల్‌కు 5,00,000 సింగపూర్ డాలర్లు (సుమారు రూ. 3 కోట్లు) గ్రాంటుతో పాటు, DBS ఫౌండేషన్ నుండి నిపుణుల మెంటార్‌షిప్, సామర్థ్య పెంపుదల, నెట్‌వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి